గుడ్‌న్యూస్: టీసీ అవసరం లేదు.. ఫీజుల బాదుడుతో..
స్కూల్స్ రీ ఓపెన్ కాబోతున్నాయి. 1వ తేదీ నుంచి బడి గంట మోగనుంది. కరోనా వల్ల చాలా మంది స్వస్థలాలకు చేరుకున్నారు. సిటీ నుంచి ఊరు చేరినవారు చాలా మంది ఉన్నారు. వారు ఇప్పుడు పల్లెలోనే చదువుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పట్నంలో పెట్టబేడ సర్దుకున్నారు. మరీ వారిని స్కూల్‌లో చేర్పించడం ఎలా.. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ) కంపల్సరీ.. దీనిపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

8వ తరగతి అవసరం లేదు
విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ తప్పనిసరి. ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండటంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన స్పందించారు. నిజానికి 8వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు టీసీ అవసరం లేదని, విద్యాహక్కు చట్టంలో టీసీ అవసరం లేదనే విషయం స్పష్టంగా ఉందన్నారు. సమస్యలు ఎదురైతే ఆయా జిల్లాల్లో డీఈవోలను సంప్రదించాలని సూచించారు. కొత్త స్కూల్స్‌లో చైల్డ్ ఇన్ఫో డేటాలో పేరు నమోదు అయ్యేలా చూడాలని శ్రీదేవసేన సూచించారు.

జూలై 1వ తేదీ నుంచి
రాష్ట్రంలో జూలై 1 నుంచి విద్యాసంస్థలు తెరువనున్న నేపథ్యంలో స్కూల్ ఫీజులపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నెలన్నర కాలం మాత్రమే 6 తరగతి నుంచి 10 తరగతి వరకు ప్రత్యక్ష బోధన కొనసాగగా, మిగతా కాలమంతా కేవలం ఆన్‌లైన్ తరగతులే కొనసాగాయి. కొవిడ్‌తో చాలామంది ఉపాధి కోల్పోయారు. దాంతో ఈ విద్యా సంవత్సరం ఫీజులు ఎలా చెల్లించాలో తెలియక సతమతం అవుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతోనే కొంతమేర ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ యాజమాన్యాలు, జూలై 1 తర్వాత ఈ విద్యా సంవత్సరం మొత్తం ఫీజుతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ఫీజును కూడా వసూలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. తల్లిదండ్రుల్లో ఫీజుల చెల్లింపుపై ఆందోళన మొదలైంది.

టీసీ పేరుతో ఫీజు వేధింపులు
కోవిడ్ నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక పాఠశాలలు మార్చాలని భావిస్తుండగా, పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు టీసీ లేకుండానే విద్యార్థులను ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారొచ్చు. ప్రతి విద్యార్థికీ వారి వయసును బట్టి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఫీజుల చెల్లింపుతో సంబంధం లేకుండా తమ పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో డాటా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు తమ పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్లిపోయినా చైల్డ్ ఇన్ డాటా అప్‌డేట్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications