Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంతలోనే ఎంత మార్పు.. మారిన స్వరం, ఇక రాజకీయాలు మాట్లాడాను బాబోయ్..

ఎవరూ చెప్పాలో.. ఎలా చెప్పాలో... లేదంటే సంకేతాలు ఇచ్చిన సరే గుమ్మని ఉండిపోతారు. అవును ఇదీ అన్నీ విభాగాలకు వర్తిస్తుంది. రాజకీయాలకు కూడా.. ఒకరికీ పదవీ ఇచ్చినప్పుడు అసంతృప్తి సహజమే.. కానీ హై కమాండ్‌పై కామెంట్స్ చేయడం అనేది.. కాస్త ధైర్యమే.. అలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు. హై కమాండ్ ఆరా తీయడంతో.. కూల్ అయ్యారు. బాబోయ్ ఇక రాజకీయాలు మాట్లాడను అంటూ చల్లబడ్డారు.

చాలు.. ఇక చాలు..

చాలు.. ఇక చాలు..


కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి పొలిటికల్‌గా ఎలాంటి కామెంట్స్ చేయనని స్పష్టంచేశారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని వెల్లడించారు. కానీ ప్రజా సమస్యలపై 24 గంటలు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎవరైనా తన ఇంటి తలుపు తట్టవచ్చన్నారు.

హై కమాండ్ సీరియస్

హై కమాండ్ సీరియస్

టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కలకలం రేపింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేయడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. గాంధీ భవన్ కు రానని, ఓటుకు నోటు విధానం ద్వారా టీపీసీసీ ఎంపిక ప్రక్రియ జరిగిందని హాట్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ, టీటీడీపీ గా మారిపోయిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతలు స్పందించలేదు. కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది.

24 గంటల్లోనే ఎంత తేడా..

24 గంటల్లోనే ఎంత తేడా..


కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా 24 గంటలు గడవకముందే..కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. రాజకీయాలు మాట్లాడనని, కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకోరనే ప్రచారం జరుగుతోంది.

రియాక్షన్.. తర్వాత నో కామెంట్స్

రియాక్షన్.. తర్వాత నో కామెంట్స్


కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ ఎన్నిక జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. టీపీసీసీకాదని, టీడీపీ పీసీసీగా మారిందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. పీసీసీని ఇంఛార్జి అమ్ముకున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. టీ పీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడారో లేదో.. వెంటనే స్వరం మార్చారు. అబ్బే ఇక రాజకీయాలు మాట్లాడనని స్పష్టంచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+