అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ విచారణకు హాజరు కాలేదు. దీంతో స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కోర్టుకు హాజరుకాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.
2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో దాడి జరిగింది. హైదరాబాద్ మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో కాంగ్రెస్ షబ్బీర్ అలీ కారులో వెళ్తుండగా కొందరు అడ్డగించారు. కారులో ఉన్న షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ ఐదేళ్లుగా ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. అయితే వాయిదాకు అసదుద్దీన్ ఒవైసీ డుమ్మా కొట్టడంతో.. నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేశారు.

Recommended Video
ఇదే కాదు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారిడిపై కూడా అసదుద్దీన్ ఒవైసీ అండ్ కో దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు కూడా విచారణ జరుగుతోంది. దీనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమీ జారీ కాలేదు. పాతబస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలకు అంత ప్రాధాన్యం ఉండదు. ఒకవేళ వెళ్లినా.. లెక్కచేయరు. అలాంటి సందర్భంలోనే దాడి జరిగింది. దీనిపై షబ్బీర్ అలీ కేసు పెట్టారు. వాయిదాకు అసదుద్దీన్ హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేశారు. ఎంఐఎంకు అధికార టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications