హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో అజిత్ దోవల్ సీక్రెట్ ఆపరేషన్- ఒంటరిగా: దేనికోసం?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అజిత్ దోవల్- జాతీయ భద్రత సలహాదారు. కోవర్ట్ ఆపరేషన్లకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆయన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు అత్యంత నమ్మకస్తుడు.. అంతే సన్నిహితుడు కూడా. భారత్-చైనా, భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో పాటు దేశ అంతర్గత భధ్రతను అనుక్షణం పర్యవేక్షించే కీలక అధికారి. అంతర్జాతీయంగా చోటు చేసుకునే కీలక, రహస్య పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకోగల శక్తి, సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి.

ఇండియన్ జేమ్స్ బాండ్..

ఇండియన్ జేమ్స్ బాండ్..

దేశ అంతర్గత భద్రత విషయంలో అజిత్ దోవల్ అనేక రహస్య ఆపరేషన్లను నిర్వహించారు. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో ఏడు సంవత్సరాల పాటు అండర్ కవర్ ఆపరేషన్ చేశారని చెబుతుంటారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు కూడా, బ్లాక్ థండర్-2 సమయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఇండియన్ జేమ్స్ బాండ్‌గా పిలుస్తుంటారు ఆయనను.

 హైదరాబాద్‌పై కన్ను..

హైదరాబాద్‌పై కన్ను..

అలాంటి అధికారి- హైదరాబాద్‌పై కన్నేశారు. రహస్యంగా పర్యటించి వెళ్లారు. భాగ్యనగరంపై సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇటీవలే మూడో కంటికి తెలియకుండా ఆయన హైదరాబాద్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. ఓ సాధారణ వ్యక్తిలా, ఒంటరిగా ఆయన ఇక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. వ్యక్తిగత భద్రత సైతం లేకుండా ఆయన.. హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారనే వార్తలు గుప్పు మంటోన్నాయి. దీన్ని ఎవరూ ధృవీకరించట్లేదు.

ఎవరికీ తెలియకుండా..

ఎవరికీ తెలియకుండా..

అజిత్ దోవల్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం నగర, రాష్ట్ర పోలీసులకు గానీ, ఇంటెలిజెన్స్ వర్గాలకు గానీ తెలియని, ఆయన పర్యటనకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఏమీ వారివద్ద లేదనే అంటున్నారు. దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఆయన.. ఓ సాధారణ కారులో తాను వెళ్లదలచుకున్న చోటికి వెళ్లారని, తాను ఎవరిని కలుసుకోవాలో వారిని కలుసుకున్నారని చెబుతున్నారు. మూడు గంటల పాటు హైదరాబాద్‌లో గడిపిన అనంతరం మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని తెలిసింది.

హైదరాబాద్‌కు ఎందుకు?

హైదరాబాద్‌కు ఎందుకు?

హైదరాబాద్‌లో రహస్యంగా అజిత్ దోవల్ పర్యటించడానికి గల కారణాలేమిటనేది తెలియట్లేదు. తన పర్యటనను అత్యంత రహస్యంగా ఉంచడానికి కారణాలేమిటి? తన మూడు గంటల పర్యటనలో ఎవరిని కలిశారు?, ఏ మిషన్ కింద హైదరాబాద్ వచ్చారు?.. అనేవి ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. అజిత్ దోవల్ పర్యటనను రాజకీయ కోణంలో చూస్తోన్న వారు కూడా లేకపోలేదు.

పీఎఫ్ఐ కోసమా?

పీఎఫ్ఐ కోసమా?


కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ను నిషేధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆ సంస్థ కార్యకలాపాలను నిషేధించింది. అదే సమయంలో పెద్ద ఎత్తున అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కొంతమంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా ఆరా తీయడానికి అజిత్ దోవల్ హైదరాబాద్ వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు.

 దర్యాప్తు సంస్థల నిఘా..

దర్యాప్తు సంస్థల నిఘా..


ప్రస్తుతం హైదరాబాద్‌పై కేంద్రీయ దర్యాప్తు సంస్థలన్నీ నిఘా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం విషయంలో సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందినవారిని అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లి అభిషేక్ రావు అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో జోక్యం చేసుకుంది. దర్యాప్తు సంస్థల కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో- ఇక్కడి స్థితిగతులను అంచనా వేయడానికి అజిత్ దోవల్ వచ్చి ఉంటారనే వాదనలు కూడా లేకపోలేదు.

English summary
National Security Advisor Ajit Doval has reportedly made a secret visit to Hyderabad without any security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X