December 31: మందు బాబులకు హెచ్చరిక.. 31 నైట్ చెక్ పోస్టులు ఎక్కడున్నాయంటే..!
మరో మూడు రోజుల్లో 2022 సంత్సరం ముగిసి 2023 సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరు సిద్ధమయ్యారు. మరి డిసెంబర్ 31 ఎంజాయ్ చేయడానికి యువత ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మనోళ్లకు ఛాన్స్ డిసెంబర్ 31 నైట్ నుంచి జనవరి 1 వరకు తాగుతూనే ఉంటారు. అందుకే టైమ్ లిమిట్ పెట్టారు.

నైట్ 1 గంట వరకు
ఈ నెల 31 రాత్రి నంచి జనవరి 1 నైట్ 1 గంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుంది. అలాగే కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్స్ నిర్వహించే ఆర్గనైజర్లు, పబ్స్, హోటల్స్, రిసార్ట్ నిర్వాహకులు 10 రోజులు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి స్పష్టం చేశారు.

తాగి డ్రైవింగ్
సెలబ్రేషన్ ముగిసిన తర్వాత మద్యం సేవించినవారు డ్రైవింగ్ చేయకుండా ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదేనని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు చేసినా యాజమాన్యందే బాధ్యత అని తెలిపారు.

డిసెంబర్ 31
ముఖ్యంగా తాగి డ్రైవ్ చేయ్యొద్దని పదే పదే పోలీసులు కోరుతున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఓ చోట కూర్చుని ఉంటారు. వీరి వద్దకు మరో వ్యక్తి వస్తాడు. అతను డిసెంబర్ 31కు మస్త్ ఎంజాయ్ చేయాలని అంటాడు.

చెక్ పోస్టులు
ముగ్గురిలో ఓ వ్యక్తి దావత్ తో పాటు తాగుదాం, తిరుగుదామని చెబుతాడు. సిటీ మొత్తం తిరుగుదాం.. కేబుల్ బ్రిడ్జ్ పై కూడా పొదామని అంటాడు. అప్పుడే మరో వ్యక్తి తాగి తిరుగుతావా అని అంటాడు.. నువ్వు ఉండేదెక్కడ మెహదీపట్నం.. కేబుల్ బ్రిడ్జ్ రావాడానికి రాయదుర్గం దాటి రావాలే.. అక్కడు రెండు చెక్ పోస్టులు ఉన్నాయి. అక్కడ దాటితే.. ఎన్సీబీ జంక్షన్ లో 4 చెక్ పోస్టులు ఉన్నాయి.
జైలు, కోర్టులు
అక్కడ దాటితే గచ్చిబౌలి జంక్షన్ లో 8 చెక్ పోస్టులు ఉన్నాయి. అక్కడ దాటితే మదాపూర్ 10 చెక్ పోస్టులు ఉన్నాయని చెబుతాడు. అవి దాటుకుని ఎట్లబోతవురా.. పోలీసోళ్లకు దొరికితే చిప్ప కూడే అని హెచ్చరిస్తాడు. మరో వ్యక్తి తాగి డ్రైవ్ చేసుడు అవసరమా.. కొత్త సంవత్సరం జైలు, కోర్టులు అవసరమా అని అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications