కట్టాల్సింది సచివాలయం కాదు: మాస్కులు, పీపీఈ కిట్స్ కోసం: సేవ్ ఉస్మానియా: కేసీఆర్ సర్కార్‌పై
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సహా తెలంగాణలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ..వేల సంఖ్యలో కరోనా పేషెంట్లు ఆసుప్రతుల్లో చికిత్స పొందుతోన్న సమయంలో.. మరోసారి డాక్టర్లు ఉద్యమించారు. ఇప్పటికే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు వేర్వేరు దశల్లో తెలంగాణ సర్కార్‌పై దండెత్తారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి హామీని పొందారు. ఇక తాజాగా- ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్ల వంతు వచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం ఉస్మానియా డాక్టర్లు ఉద్యమిస్తున్నారు.

ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్ల నిరసన..
ఉస్మానియా ఆసుపత్రిని కాపాడాలంటూ ఉద్యమించారు డాక్టర్లు. మంగళవారం నుంచి ప్రతిరోజూ గంట పాటు విధులను బహిష్కరించనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఉస్మానియా డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్‌షిప్ చేస్తోన్న వారు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించడంతో పాటు చాలినన్ని మాస్కులు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ (పీపీఈ) కిట్లను అందజేయాలనేది వారి ప్రధాన డిమాండ్.

టీజీడీఏ సారథ్యంలో..
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్ల అసోసియేషన్ (టీజీడీఏ) సారథ్యంలో ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ తమ నిరసన ప్రదర్శనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్యలో ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డాక్టర్ల ప్రాణాలను కాపాడాలంటూ నినదించారు.

కొత్త సచివాలయం కాదు.. కొత్త ఉస్మానియా ఆసుపత్రి..
కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా సచివాలయం నిర్మాణానికి పూనుకుంటోందని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కట్టాల్సింది కొత్త సచివాలయం కాదని వారంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవన సముదాయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని నినదించారు. దీనికోసం సేవ్ ఉస్మానియా పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఉస్మానియా సహా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని, వాటిని పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకోవడం సరికాదని అంటున్నారు.

మాస్కులు, పీపీఈ కిట్ల పంపిణీలో..
ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు చికిత్సను అందించే సందర్భంలో పలువురు డాక్టర్లు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఉస్మానియా డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రనకా, పగలనకా పేషెంట్లకు చికిత్స అందించే డాక్టర్లకు ప్రభుత్వం చాలినన్ని మాస్కులు, పీపీఈ కిట్లను పంపిణీ చేయట్లేదని విమర్శిస్తున్నారు. తమకు చప్పట్లు కొట్టడం, దీపాలను వెలిగించడం, తమపై పూలను చల్లి అభినందించడం కాదని.. కరోనా బారిన పడకుండా పీపీఈ కిట్లు, మాస్కులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మురుగునీటితో నిండిన వార్డుల్లో..
ఒక్క భారీ వర్షం పడితే ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట కురిసిన భారీ వర్షానికి ఆసుపత్రిలోని వార్డుల్లో మురుగునీరు పోటెత్తిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్లకు నాణ్యమైన వైద్యం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications