హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సెంట్రల్ యూనివర్శిటీల్లో ఖాళీగా 300 టీచింగ్ పోస్టులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఉన్న మూడు సెంట్రల్ యూనివర్శిటీలో కలిపి మొత్తం 300 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ , ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్శిటీల్లో 317 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ

ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో 53 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెచ్‌సీయూలో 63 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇక మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, ఇఫ్లూలలో 36 మరియు 25 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇక హెదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 46 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా 6వేల టీచింగ్ పోస్టులు ఖాళీ

దేశవ్యాప్తంగా 6వేల టీచింగ్ పోస్టులు ఖాళీ

ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే వివిధ సెంట్రల్ యూనివర్శిటీల్లో 6వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 2753 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2452 అసోసియేట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిలిపివేయడం జరిగింది. వివాదాస్పద 13 పాయింట్ల రోస్టర్ సిస్టం అమలు చేయాలని కేంద్రం భావించింది. అంతకుముందు 200 పాయింట్ల సిస్టంను అమలు చేసేవారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే ఈ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదని హెచ్‌సీయూ సిబ్బంది చెబుతోంది.

 తెలంగాణలో 1000 నాన్ టీచింగ్ పోస్టులు

తెలంగాణలో 1000 నాన్ టీచింగ్ పోస్టులు


సెంట్రల్ యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు హ్యూమన్ రిసోర్స్ మంత్రిత్వశాఖ సమాధానంగా చెప్పింది. ఇక తెలంగాణలో మూడు సెంట్రల్ యూనివర్శిటీల్లో కలిపి మొత్తం 1000 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.ఒక్క హెచ్‌సీయూలోనే 674 పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్శిటీల్లో మొత్తం 12000 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 9036 గ్రూప్ సీ పోస్టులు, 2,533 గ్రూప్ బీ పోస్టులు, 754 గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి.

English summary
Even as Telangana suffers from a high unemployment rate compared to other states in the country, more than 300 teaching posts remain vacant in the state’s three Central universities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X