హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sex గురించి పిల్లలతో డిస్కష్ చేయండి.. శారీరక అవసరం కాదు.. ఆత్మల కలయిక

|
Google Oneindia TeluguNews

పేరంట్స్ పిల్లలతో అన్ని విషయాలను మాట్లాడగలరు. సెక్స్ గురించి చర్చించడానికి ఇష్టపడరు. పేరెంట్స్ కూడా చెప్పకపోవడంతో ఆ విషయం గురించి కొందరికి అవగాహన లేకుండా పోతుంది. మరికొందరికీ ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయడం.. లేదంటే కొందరు.. తమకు తెలిసిందే.. నిజమని అనుకుంటారు. పిల్లలు.. టీనేజ్ వయసు వచ్చే సరికి.. సెక్స్ గురించి పిల్లలకు అవగాహన కలిగించాలి. అది కేవలం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది.

 సిగ్గు పడొద్దు

సిగ్గు పడొద్దు

ఏమీ మాట్లాడక సిగ్గుపడితే.. తమ పిల్లలు ఇబ్బంది పడతారనే విషయాన్ని గుర్తించాలి. శారీరక, మానసిక ఎమోషన్స్ గురించి వారికి క్షుణ్ణంగా వివరించాలి. అందరు పేరంట్స్ పిల్లలతో ఇలాంటి విషయాల గురించి మాట్లాడరు. వారే తెలుసుకుంటారు లే అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు అని నిపుణులు చెబుతున్నారు. చెప్పకపోవడం వల్ల తప్పులు జరుగుతుంటాయి. టీనేజ్ వయసు వచ్చిన వారికి సరైన మార్గదర్శకం కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు అనే విషయాన్ని గుర్తించాలి. అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. వారికి వచ్చిన అపోహలను వారు కూడా మీతో చర్చించగలుగుతారు. పొరపాట్లు చేయకుండా ఉంటారని నిపుణులు తెలిపారు.

ఎవెర్‌నెస్ కంపల్సరీ

ఎవెర్‌నెస్ కంపల్సరీ

సెక్స్ గురించి పెద్దలకు మాత్రమే కాదు, యుక్తవయస్సులోకి ప్రవేశించే యువకులకు కూడా ముఖ్యమైంది. అవగాహన వారికి ఉంటే.. ఏ వయసులో దానికి కమిట్ అవ్వాలి అనే విషయం వారికి అర్థమవుతుంది. పుస్తకాల్లో కొంత వరకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నా.. వారికి వచ్చే అనుమానాలు కేవలం పేరంట్స్ మాత్రమే తీర్చగలరు. ఈ విషయంలో తల్లిదండ్రులే అండగా ఉండాలి. వారికి ఉండే భయాలు, అనుమానాల గురించి అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులతోపాటు తమ టీనేజ్ పిల్లలు కూడా ఈ విషయాల గురించి మాట్లాడటానికి ఇబ్బందిగా భావించే అవకాశాలు ఉన్నాయి. వారితో తరచూ ఆ టాపిక్ తీసుకురావడం వల్ల.. వారు ఆ ఇబ్బంది నుంచి బయటపడి అన్ని విషయాలను మీతో ఫ్రీగా చర్చించే అవకాశం ఉంటుంది.

 ప్రాబ్లమ్స్

ప్రాబ్లమ్స్

టీనేజ్ వయసులో శృంగారం.. ఎన్ని సమస్యలు తీసుకువస్తుంది. ఏ వయసులో ఇది కరెక్ట్.. గర్భం, అసురక్షిత శృంగారం.. సెక్స్ సంబంధిత వ్యాధులు.. ఇలా ప్రతి విషయాన్ని సున్నితంగా.. చెప్పదగిలిన భాషలో చెప్పగలగాలి. యుక్తవయస్కులతో సెక్స్ విషయాలను చర్చిస్తున్న సమయంలో తల్లిదండ్రులు సమ్మతిని అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా..? వారితో ఏ స్టేజ్ లో ఉన్నారు.. లాంటి విషయాలను కూడా గమనించాలి. వారు మీతో అన్ని విషయాలు చర్చించుకునే ఫ్రీడమ్ మీరు వారికి ఇవ్వాలి. లైంగిక సమ్మతి గురించి మీ పిల్లలతో మాట్లాడుతున్న సమయంలో సెక్స్ అనేది కేవలం శారీరక అవసరాలకే కాదు, ఇద్దరు ఆత్మల కలయిక అనే విషయాన్ని వారికి స్పష్టంగా వివరించాలి. దీనిని వారు అర్థం చేసుకుంటే సెక్స్ విషయంలో తప్పులు చేయరు.

English summary
parents must discuss sex topic to their children experts said. they are not shy to talk to sex topic children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X