• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పాస్టర్ ప్రవీణ్ అక్రమ గని.. బానిసలుగా మైనర్లు, రూ.కోట్లు దండుకొని.. సోషల్ మీడియాలో పోస్టులు

|

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. దేవతల విగ్రహాల ధ్వంసం చేయడంతో ప్రవీణ్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అయితే అక్రమార్జన కోసం దేశ ప్రతిష్ఠను బజారు కీడ్చాడని లీగల్‌ రైట్స్‌ ఫోరం హైదరాబాద్ శాఖ ఇటీవల జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బానిసత్వం నుంచి బాలలకు విముక్తి కల్పన పేరుతో దేశానికి అపఖ్యాతి తెచ్చేలా వ్యవహరించారని ఫోరం ప్రతినిధులు వివరించారు.

ఐదేళ్లలో రూ.93.67 కోట్లు

ఐదేళ్లలో రూ.93.67 కోట్లు

కాకినాడ రూరల్‌ మండలంలో బాలబాలికల కోసం ప్రవీణ్‌ చక్రవర్తి సైలోమ్‌ బ్లైండ్‌ సెంటర్‌ సొసైటీ పేరుతో అనాథ శరణాలయం నడిపిస్తున్నాడు. బ్యూషన్‌ లైసెన్స్‌ కలిగిన సెంటర్‌కు 2013-18 వరకు అమెరికాలో ఉన్న సెట్‌ ఫ్రీ అలయన్స్‌, వాటర్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే సంస్థల నుంచి నగదు అందాయి. గత ఐదేళ్లలో రూ. 93.67 కోట్ల ఫండ్స్ వచ్చాయి. ఇంత పెద్దమొత్తంలో డబ్బు పంపడం వెనక మత మార్పిళ్లే ప్రధాన ఉద్దేశంగా తేలింది. భారత్‌లో ఏ ఏడాది ఎంతమందిని మతం మార్చాడో వివరిస్తూ వాటర్‌ ఆఫ్‌ లైఫ్‌ సంస్థ తన వెబ్‌సైట్‌లో డేటా కూడా పెట్టింది.

బానిసలుగా మైనర్లు

బానిసలుగా మైనర్లు

దీనిపై ఫోరం 2019 డిసెంబరు 5న కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. విదేశీ నిధుల కోసం భారత్‌ పరువును ప్రవీణ్ రోడ్డుకీడ్చాడని ఆరోపించింది. తప్పుడు గణాంకాలను అమెరికన్‌ క్రైస్తవ సంస్థలకు అందించారని.. ప్రపంచంలో భారత్‌లో అత్యధిక బానిసలున్నారని పేర్కొన్నారు. వీరిలో 7-14 ఏళ్ల మైనర్‌ బాలలు ఉన్నారనే దుష్ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. ఎక్కడి నుంచో చిన్న పిల్లలను తీసుకువచ్చి, కృత్రిమ వీడియోలతో వారిని బానిస బాల కార్మికులుగా విదేశీ క్రైస్తవ సంస్థల అధిపతులకు చూపించి ప్రవీణ్ నిధులు రాబట్టడం ప్రారంభించారు.

41765 మంది బానిసలు

41765 మంది బానిసలు

బానిసలుగా ఉన్న బాలికలు లైంగిక దాడులకు గురైనట్టు కట్టు కథలు సృష్టించేవాడని తెలిసింది. ఇలా ప్రవీణ్‌ అక్రమ మార్గంలో కోట్లు సంపాదించారు. ఇప్పటి వరకు 41,765 మంది బానిసలుగా పనిచేస్తున్న బాలకార్మికులను విముక్తి చేసి, వారిని పునరావాసం కల్పించినట్టు సెట్‌ ఫ్రీ అలయన్స్‌ సంస్థ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోందని గుర్తించారు. పోలీస్‌, రెవెన్యూతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం దేశంలో ఏదైనా స్వచ్ఛంద సంస్థకు, వ్యక్తులకు బాల కార్మికులు కనిపిస్తే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలాకాక అతని వద్ద వేలాదిమంది బాలలను బందీగా చేసుకునే అధికారం ఎవరిచ్చారో నిగ్గుతేల్చాలని ఫోరం కోరింది.

  AP Panchayat Elections: ఏకగ్రీవాలపై అపోహలు వద్దు Collector D. Muralidhar Reddy
  సోషల్ మీడియాలో పోస్టులు

  సోషల్ మీడియాలో పోస్టులు

  లాక్‌డౌన్‌ సమయంలో తన వసతి గృహాల్లో 1500 మంది బాలబాలికలున్నారని, వారిలో 318 మందికి కరోనా సోకిందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి మరీ ప్రవీణ్‌ చందాలు వసూలు చేశాడు. ఈ మేరకు లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రవీణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

  English summary
  pastor praveen chakravarthy collected crore from foreign christian companies. five years he collect rs.93.67 crores.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X