పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం: పెద్దమొత్తంలో ఆస్తి నష్టం
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పెయింట్, రసాయన పరిశ్రమల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.
ముందుగా పెయింట్ పరిశ్రమలో మంటలు వచ్చాయి. వాటిని అదుపులోకి తీసుకురాలేకపోవడంతో పక్కనే ఉన్న రసాయన పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. దీంతో రసాయనాలతో కూడిన డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. మంటలు రసాయన పరిశ్రమ అంతటికి వ్యాపించడంతో యంత్రాలు కూడా దగ్ధమయ్యాయి.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు సంగారెడ్డి, పటాన్‌చెరు, బీడీఎల్, బొల్లారం ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నగరంలోని పలు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications