గాంధీ ఆస్పత్రి నుంచి దూకి సూసైడ్.. అతనికి కరోనా పాజిటివ్
అసలే కరోనా విజృంభిస్తోంది. దీంతో గాంధీ ఆస్పత్రిలో మిగతా సేవలను నిలిపివేశారు. అయితే ఇవాళ ఒక రోగి చనిపోయాడు. ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. అతను కావాలని దూకి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రమాదవశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి కరోనా రోగిగా గుర్తించారు. రోగి వివరాలు కూడా ఆసుపత్రిలో నమోదు కాకపోటంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కానీ సర్జరీలను నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు మాత్రమే పూర్తిస్ధాయిలో సేవలను అందిస్తున్నారు. ఇంతలో ఇలా జరగడం పలు సందేహాలకు తావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల తీవ్రత ఎక్కువ అవుతుంది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలంటూ తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అలాగే సోషల్ డిస్టెన్స్, మాస్కుల నిబంధనలను రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు సూచించింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన స్వల్ప లక్షణాలు రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.












Click it and Unblock the Notifications