తెలంగాణలో తగ్గుముఖం: 729 కేసులు.. ఐదుగురు మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. 772 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకిన ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 6,36,049కి పెరిగాయి.
ఇవాళ్టి వరకు 6,22,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 9980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఐదుగురు చనిపోగా.. మొత్తం మరణాలు 3756కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,15,515 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications