Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మండిపోనున్న ఎండలు..!
చలికాలం అంటేనే వణికిపోతాం. ఉదయం లేటుగా లేస్తాం. సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరుతాం. అయితే ఈసారి చలికాలం అంతగా లేదనే చెప్పాలి. అప్పుడప్పుడు కాస్త చలి అనిపించిన నాలుగు, ఐదు రోజులు మాత్రమే ఉండేది. ఈ చలికాలమంతా సాదాసీదాగా గడిచిపోయింది. ప్రస్తుతం ఫిబ్రవరిలోకి అడుకు పెట్టాం. దీంతో ప్రస్తుతం ఉన్న కాస్త చలి కూడా తగ్గుతోంది.
ఈ చలికాలంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ జనవరిలో 14 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు తగ్గలేదు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం ఫిబ్రవరి 2 శుక్రవారం నాడు హైదరాబాద్‌లో పగటిపూట ఉష్ణోగ్రత 32.4°C ఉష్ణోగ్రత నమోదు అయింది. టెంపరేచర్ రాబోయే నాలుగు రోజుల్లో 35 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీన్ని ఈసారి వేసవి కాలం ఎండలు దంచికొట్టనున్నాయి.

యూసుఫ్‌గూడలోని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పగటి ఉష్ణోగ్రత 34.1°C వద్ద నమోదైంది. GHMC పరిమితుల్లోని చాలా ప్రాంతాల్లో శనివారం ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 33°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలు 17°C వద్ద ఉండాలి కానీ ఇప్పుడు సగటున 21.7°C నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.
ఫిబ్రవరిలోన ఎండలు ఇంతగా ఉంటే మార్చి, ఏప్రిల్, మేలో ఇక బట్టలు తడవడం ఖాయమని చెబుతున్నారు. ఈసారి భారీస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పుడే లోక్ ఎన్నికలు, అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఎండలను చూసి నాయకులు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications