హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sri reddy:సామ్-చైతూ బంధం, సీన్‌లోకి శ్రీ రెడ్డి.. షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

శ్రీ రెడ్డి.. ఏం చేసినా సంచలనమే.. ఇటీవల ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా మరోసారి లైన్ లోకి వచ్చారు. ఈ సారి చై సామ్.. బంధం గురించి కామెంట్ చేశారు. చైతన్య, సమంత విడిపోయారని.. దూరంగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగ చైతన్య తన లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ గురించి ట్వీట్ చేయగా.. సమంత స్పందించారు. దీనికి చై కూడా థాంక్స్ చెప్పారు. దీంతో వారి మధ్య ఏమీ లేదని చర్చకు దారితీసింది. కానీ కొందరు అదేం లేదు అని అంటున్నారు.

 సీన్‌లోకి శ్రీ రెడ్డి

సీన్‌లోకి శ్రీ రెడ్డి

చై, సామ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారని అయినా ఇద్దరు మారలేదని రూమర్స్ వచ్చాయి. దీంతో శ్రీ రెడ్డి రంగంలోకి దిగారు. చై సామ్ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అని గుర్తుచేశారు. వారిపై తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. పుకార్లు ఎందుకు సృష్టిస్తున్నారని అడిగారు. ఇదీ సరికాదని సూచించారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. చై, సామ్ గురించి శ్రీ రెడ్డి పాజిటివ్ గా మాట్లాడారు. నెటిజన్లకు సూచనలు చేశారు. లేనిది ఊహించుకోవడం సరికాదు అని చెప్పారు. శ్రీ రెడ్డి రియాక్షన్ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయినా ఆమె చేసేదీ మంచి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

సెన్సేషనల్

సెన్సేషనల్

శ్రీ రెడ్డి అంటేనే సెన్సేషనల్.. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఒక్కసారిగి వార్తల్లోకి వచ్చారు. తర్వాత టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సినిమా అవకాశాలు అంతంతమాత్రమే కావడంతో యూట్యూబ్ చానెల్ కూడా పెట్టారు. దాంతో ఏదో అలా నెట్టుకు వస్తున్నారు. అయితే ఇటీవల శ్రీ రెడ్డి సైలంట్ అయిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే శ్రీరెడ్డి.. గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు.

దాయను

దాయను

ఆ మధ్యలో హైదరాబాద్‌కి కూడా వచ్చాను.. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా.. నాకు జబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదన్నారు శ్రీ రెడ్డి. ఈ డిప్రెషన్ అనే ప్రాబ్లమ్ వల్ల లాక్ డౌన్‌లో చాలామంది బాధపడుతున్నారు. ఫైనాన్సియల్‌గా కూడా చాలామంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి నాతో పాటు అందరూ బయటపడాలని కోరుకుంటున్నా అని శ్రీ రెడ్డి చెప్పారు. ఇప్పుడైతే ఫేస్ బుక్‌కి దూరంగా ఉన్నాను కానీ.. యూట్యూబ్‌కి సంబంధించి కొన్ని వీడియోలు బ్యాకప్ చేస్తున్నా.. వరుసగా వీడియోలను రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు శ్రీరెడ్డి.

 కరోనా కల్లోలం..

కరోనా కల్లోలం..

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

Naga Chaitanya Samantha విడాకులు వివాదానికి చెక్.. ఎందుకీ లొల్లి ! || Oneindia Telugu
 ఫంగస్ బెడద

ఫంగస్ బెడద

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.

English summary
please..don't rumours about samantha naga chaitanya couple Sri reddy asked to netizens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X