హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామప్పకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా..మోడీ, కేసీఆర్ హర్షం..

|
Google Oneindia TeluguNews

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించి, గొప్పదనం గురించి అనుభవాన్ని పొందాలని కోరారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయం అని కొనియాడారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

42 కట్టడాలు

42 కట్టడాలు

ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలను ఈసారి గుర్తింపు ఇవ్వగా మన దేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ అపురూప ఆలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. యునెస్కో గుర్తింపుతో ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది.

కేసీఆర్ హర్షం..

కేసీఆర్ హర్షం..

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు.

కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారు. కాకతీయ శిల్పకళా నైపుణ్యం దేశంలోనే ప్రత్యేకమైంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి పూర్వ వైభవానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీఆర్‌ సైతం ఆనందం వ్యక్తం చేశారు.

Recommended Video

Bandi Sanjay Says CM Kcr who has not fulfilled any of the promises | Oneindia Telugu
కేసీఆర్ వల్లే

కేసీఆర్ వల్లే

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన రామ‌ప్పకు ప్రపంచ వార‌స‌త్వ హోదా గుర్తింపు రావ‌డం తెలంగాణ వారంద‌రికి గర్వకారణమని పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్ రావు అన్నారు. రామప్పకు ఈ ఘనకీర్తి దక్కడం సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉంద‌ని ఆయ‌న తెలిపారు. చారిత్రిక వార‌స‌త్వ క‌ట్టడమై రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. వారసత్వ గుర్తింపు లభించడంతో రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తమైంద‌ని హర్షం వ్యక్తం చేశారు.

English summary
pm modi congratulate people of telangana for ramappa world heritage site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X