తెలంగాణ వంటకాల రుచులు అదుర్స్.. ప్రధాని మోడీ ప్రశంసలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సాయంత్రం ముగిశాయి. కార్యవర్గ సమావేశాలకు దాదాపు 1,500 మంది హాజరయ్యారు. వీరందరికి ప్రత్యేక వంటకాలు తయారు చేయించారు. యాదమ్మ చేతి వంట విని ఆహా ఓహో అన్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు యాదమ్మ, ఆమె బృందం అతిథులకు తెలంగాణ వంటకాలను రుచికరంగా తయారు చేశారు. తెలంగాణ వంటకాలను ప్రధాని మోదీ ఇష్టంగా రుచిచూసినట్లు తెలిసింది.

మూడుసార్లు
శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు మూడు సార్లు ప్రధాని నరేంద్ర మోడీ డైనింగ్ హాల్ సందర్శించారు. తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను కొన్నింటిని ప్రధాని రుచి చూశారు. వంటల గురించి అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ వంటలు రుచికరంగా ఉన్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారని పార్టీ నేతలు తెలిపారు.
వావ్.. సూపర్ టేస్ట్
ప్రధానితో సహా సమావేశానికి వచ్చిన అతిథులు తెలంగాణ వంటకాలను రుచి చూసి యాదమ్మ బృందాన్ని అభినందించారని పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వంటకాలను వడ్డించారని అతిథులు రాష్ట్ర పార్టీ నేతలను అభినందించారు.
వెజ్ కర్రీస్
చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ చేశారు.

స్వీట్, స్నాక్స్ ఇవే
బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు స్వీట్స్.. పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి ఇవీ స్నాక్స్‌గా అందజేస్తారు. యాదమ్మ చేతి వంటి తింటే మరోసారి గుర్తుకు చేస్తారని అంతా అంటారు. నేటి వంటలతో ఆమె పేరు యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది.












Click it and Unblock the Notifications