పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలు... దిశ సంఘటనతో పోలీసుల ఆదేశాలు
శాంషాబాద్‌లో జరిగి దిశా హత్య సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భవిష్యత్‌లో ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా పలు చర్యలు చేపడుతున్న పోలీసులు జాతీయా రహాదారులపై కూడ దృష్టి సారించారు. దిశ సంఘటన.... నిత్యం వందలాదీ వాహానాలు తిరిగే జాతియ రహాదారిపై చోటు చేసుకోవడంతో... ఆయా రహాదారుల్లో సరైన లైటింగ్‌తో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లు కూడ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. జాతీయ రహాదారులతో పాటు ఇతర అంశాలపై శంషాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
దిశా సంఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె మృతి తర్వాత దారుణంగా పెట్రోల్ పోసి కాల్చడం తెలిసిందే... ఖాలీ సీసాల్లో పెట్రోల్ లభించడం ఇందుకు ప్రధాన కారణం... పెట్రోల్ ఖాలీ సిసాల్లో లభించడమని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయా రహాదారుల వెంట ఉన్న పెట్రోల్ బంకుల యాజమానులతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా పలు సూచనలు చేశారు. పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , దీంతో పాటు ఖాలీ బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దని సూచించారు.

ఇక పెట్రోల్ యాజామాన్యాలతో పాటు జాతీయ రహాదారులు మరియు పురపాలక శాఖ అధికారులతో కూడ సమావేశం అయ్యారు. జాతీయ రహదారులతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఇక జాతీయ రహాదారుల వెంట ఎక్కడపడితే అక్కడ వాహానాలు పార్క్ చేయకుండా పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో జాతీయ రహాదారులపై కూడ పర్వవేక్షణను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక జాతీయ రహాదారులపై ఎదైన ఎమర్జెన్సీగా కంటాక్ట్ చేసేందుకు నెంబర్లను సైతం వాహానదారులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications