రూ.39 లక్షలు: సస్పెండెడ్ ఖాకీ వ్యవహారం, సెటిల్‌మెంట్ లే, డబ్బులు ఇవ్వలే.. అడిగితే బెదిరింపులు
అతను సస్పెండ్ అయిన ఖాకీ.. ఎలాగు పని లేదు కదా.. అని సెటిల్‌మెంట్లు స్టార్ట్ చేశాడు. చిన్న, చితక కాదు.. లక్షల్లో వ్యవహారం నడిచింది. కానీ ఎప్పుడో ఓ సారి అతని పాపం పండాలి కదా.. అది ఓ సెటిల్‌మెంట్ విషయంలో బయటకు వచ్చింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని భాగ్యనగరంలో ఈ ఘటన జరిగింది.

ఆర్ఎస్ఐ నుంచి ఆర్ఐ.. కానీ
వరంగల్ జిల్లాకు చెందిన అల్లం కిషన్‌రావు 1985లో ఆర్‌ఎస్ఐగా ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఆర్‌ఐ (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్)గా పదోన్నతి పొందాడు. కానీ పోస్టింగు అలా ఉంచుకోలేదు. 1996లో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు ఓ కేసు పని మీద వెళ్లిన కిషన్‌రావు.. అక్కడ ఓ దాబాలో రివాల్వర్‌తో గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీనిపై మహారాష్ట్రలో క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఇంకేముంది కిషన్‌రావును పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన అప్పటి నుంచి మోసాలు చేయడం మొదలు పెట్టాడు.

అడ్డా ఇక్కడే
యూసుఫ్‌గూడ పోలీసు క్వార్టర్స్‌ను అడ్డాగా మార్చుకున్నాడు. సర్వీసులో ఉండగా ఏకే 47 గన్‌తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ప్రొఫైల్‌గా వాడుకుంటున్నాడు. తాను విశ్రాంత డీఐజీ స్థాయి అధికారినని ప్రచారం చేసుకున్నాడు. భూ వివాదాల సెటిల్‌మెంట్లు, ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. అయితే కృష్ణానగర్‌కు చెందిన ఎండీ అబ్బాస్ రెండెకరాల భూమిని కొనుగోలు చేసేందుకు గతేడాది అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ స్థలాన్ని మరొకరు ఆక్రమించినట్టు తెలుసుకున్నాడు. ఈ వివాదం సెటిల్‌మెంట్ కోసం లక్ష్మణ్ అనే మధ్యవర్తి ద్వారా కిషన్‌రావును కలిశాడు.

రూ.కోటి.. రూ.39 లక్షలు అప్పజెప్పి
సెటిల్‌మెంట్‌కు రూ. కోటి అవుతుందని కిషన్‌రావు చెప్పాడు. టేబుల్ మీద పిస్తోల్ చూసిన అబ్బాస్ ఎలాగైనా సెటిల్ చేస్తాడని భావించి రూ. 39 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా స్థలం వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అబ్బాస్ కోరాడు. డబ్బు ఇవ్వకపోగా ఆయుధం చూపించి చంపేస్తానంటూ, పలు ఎన్‌కౌంటర్లు తన హయాంలోనే జరిగాయని కిషన్‌రావు బెదిరించాడు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.

37 మద్యం సీసాలు
పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిషన్‌రావు క్వార్టర్స్‌పై దాడి చేసి అతడిని అరెస్టు చేయడంతోపాటు రెండు పెద్ద గన్‌లు, రెండు రివాల్వర్లు, స్కార్పియో, ఫోర్డ్ ఫిస్టా, బ్రీజా కార్లతో పాటు 37 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పరిశీలనలో ఎయిర్ గన్‌లని తేలింది. కిషన్‌రావుకు సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతడిపై పలు పోలీస్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications