ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్: భారీ నగదుతోపాటు రూ. కోటి విలువైన సొత్తు స్వాధీనం
హైదరాబాద్: ఐపీఎల్ 2023 మొదలైన నాటి నుంచి దేశ వ్యాప్తంగా బెట్టింగ్‌లు మొదలయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు మోసగాళ్లు ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహా నగర పోలీసులు ఈ బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తాజాగా, స్పెషల్ ఆపరేషన్ టీం ఓ బెట్టింగ్ ముఠాను పట్టుకుంది. వారి దగ్గర నుంచి రూ. కోటి నగదుతోపాటు మొబైల్స్, పరికరాలున స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నరనే సమాచారం అందింది. దీంతో బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు వెళ్లి సోదాలు చేశారు. పలువురు బుకీలను ఏర్పాటు చేసుకుని యూసఫ్‌గూడకు చెందిన వెంకట శివరామకృష్ణ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రధాన బుకీ పాండు పరారీలో ఉన్నాడు.
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్ చేస్తున్న పది మంది బుకీలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, బెట్టింగ్‌కు ఉపయోగించే ఇతర పరికరాలను సీజ్ చేశారు. డబ్బుతోపాటు పరికరాల విలువ మొత్తం రూ కోటి ఉంటుందని సీపీ తెలిపారు.
The Cyberabad SOT Balanagar Zone has busted several organized cricket betting rackets during the ongoing IPL 2023 cricket matches. They have apprehended 23 cricket bookies who were involved in online cricket betting and seized Net cash of Rs. 66,28,239,
— Cyberabad Police (@cyberabadpolice) April 11, 2023
14 betting boards, pic.twitter.com/81zbaZsJmh
క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్ పెట్టాలనుకునే వాళ్లు సాధారణంగా ఇంటర్నెట్‌లో వెతుకుతుంటారని.. అలాంటి వాళ్లను ఆకట్టుకునే విధంగా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
తమను సంప్రదించే బుకీలను, నిందితులు ప్రత్యేక సెల్‌ఫోన్ నెంబర్‌తోపాటు బెట్టింగ్ డబ్బులు జమ చేసేందుకు బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. బంతి బంతికి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కనీసం రూ. 50 వేలతో బెట్టింగ్ పెట్టేలా బుకీలు ఏర్పాట్లు చేశారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
మూసీ తీరాన మహత్తరం -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications