Hyderabad: ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం తీసుకోండి.. పోలీసుల సూచన..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా భారీ వాన పడింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా అమీర్ పేట, మైత్రివనం, ఎస్సార్ నగర్, మూసాపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసాపేట మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో ద్విచక్ర వాహనాలను దారి మళ్లించి.. భారీ వాహనాలను వరదలొంచే పంపుతున్నారు.

వర్షాలు ఇంకా ఉన్నాయని వాతవరణ శాఖ పేర్కొంది. రేపు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు పోలీసులులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షం వస్తే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఇబ్బందుసు పెరుగుతాయని భావిస్తోంది. మంగళవారం భారీ వర్షంతో చాలా చోట్ల నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు గంటలకొద్ది రోడ్లుపై ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్టేట్ పోలీసులు ఓ సూచన చేశారు.

Police asked IT employees in Hyderabad to work from home
హైటెక్ సిటీ, ఇతర ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడకుండా.. అవకాశాన్ని బట్టి.. ఐటీ ఉద్యోగులు అందరూ ఇళ్ల దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాలని ఆయా కంపెనీల యజమానులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కూకట్ పల్లి, కేపీహెచ్ బీ. ప్రగతినగర్, గచ్చిబౌలి, నిజాంపేట, మియాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ట్రాఫిక్ జాం ఏర్పడిందని. బుధవారం కూడా భారీ వర్షం కురిస్తే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని.. అందుకే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీసులు కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు బుధవారం కూడా సెలవు ప్రకటించారు. ప్రస్తుతానికి అయితే సిటీలో వర్షం విరామం ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు వరకు పడిన వాన కాస్త తెరుపునిచ్చింది. అయితే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ పరిధిలో పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావ ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+