హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల...వైకుంఠపురములో ఈవెంట్ నిర్వహకులపై కేసు: నిబంధనలు ఉల్లంఘించారంటూ ..!

|
Google Oneindia TeluguNews

అల...వైకుంఠపురములో సినిమా మ్యూజిక్‌ ఈవెంట్ నిర్వహకుల మీద కేసులు నమోదయ్యాయి. అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా శ్రేయాస్‌ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ మేనేజర్‌ యగ్నేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన సమచారం.. హామీలను ఉల్లంఘించారని..చెప్పిన సమయం కంటే అర్ద్రరాత్రి వరకు వేడుక నిర్వహించారనే కారణంతో ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనుమతులకు విరుద్దంగా..

అనుమతులకు విరుద్దంగా..

హీరో అల్లు అర్జున్ నటించిన అల...వైకుంఠపురములో సినిమా మ్యూజికల్ నైట్ వేడుకను ఏర్పాటు చేసిన నిర్వాహకులపై కేసులు నమోదు అయ్యాయి. సినిమా మ్యూజికల్ నైట్ వేడుక నిర్వహణ సమయం లో నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్‌ గూడ బెటాలియన్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహించారు. కార్యక్రమానికి సినిమా హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, పూజాహెగ్డేతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు హాజరయ్యారు.

అధికంగా పాసులు..ఎక్కువ సమయం

అధికంగా పాసులు..ఎక్కువ సమయం


వేడుకకు అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువ మందికి పాసులు ఇవ్వడం.. కార్యక్రమం రాత్రి 11:30 గంటలకు వరకు కొనసాగడంతో ఈ మేరకు కేసులు నమోదు చేశారు. అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఈవెంట్ నిర్వహణ కోసం
ఈ నెల 2న హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ మేనేజర్‌ కె.యగ్నేష్‌ పోలీసుల అనుమతి తీసుకున్నారు. వేడుకలకు దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని అతను పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. కానీ, ఈవెంట్ నిర్వహణలో మాత్రం అది ఉల్లంఘించారని ప్రధాన ఫిర్యాదు

తొక్కిసలాటకు కారణమైందపి..

తొక్కిసలాటకు కారణమైందపి..

శ్రేయాస్‌ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమం చెప్పిన సమయం కంటే... గంటన్నర అదనంగా కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్‌లు ఇచ్చామని చెప్పిన నిర్వాహకులు దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లుగా గుర్తించారు. కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర అసౌకర్యానికి, ఉద్రిక్తతకు దారితీసిందని తొక్కిసలాట జరిగిందని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ నవీన్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రేయాస్‌ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు యగ్నేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Police filed case against Ala Vaikuntapuramlo Event management. Police says that Event maganers failed in commitments which given to police at the permission time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X