Hyderabad: బంగారం దోపిడీ కేసులో వాడిన వాహనాలు ఎక్కడివంటే..
హైదరాబాద్ నాగోలు స్నేహపూరి కాలనీలో జరిగిన బంగారం దొంగతనం కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 15 టీమ్ లు ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. బంగారం దుకాణంలో దొంగతనం చేసేందుకు దుండగులు ఒక పల్సర్ బైక్, యాక్టివా స్కూటీని ఉపయోగించారు. అయితే ఈ రెండు వాహనాలు దొంగతనం చేసినవే అని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా తేల్చారు.

ఎన్‌జీవోస్ కాలనీ
ఎన్‌జీవోస్ కాలనీకి చెందిన కల్యాణ్ సింగ్ నాగోలు స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్-6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపుతున్నాడు. గురువారం రాత్రి 9 గంటల 30 నిషాలమ ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ బంగారాన్ని ఇవ్వడానికి దుకాణానికి వచ్చాడు. అంతుకు ముందు నుంచే దుండగులు సుఖ్ దేవ్ వెంబడిస్తున్నారు. సుఖ్ దేవ్ ను పల్సర్, యాక్టివా బైక్‌లపై ఫాలో చేశారు.

కాల్పులు
సుఖ్ దేవ్ మహదేవ్ జ్యువెలరీ దుకాణంలోకి వెళ్లగానే నిందితులు వెళ్లారు. ఆ తర్వాత దుకాణం షట్టర్ క్లోజ్ చేసి బంగారం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సుఖ్ దేవ్, కల్యాణ్ సింగ్ అడ్డుకునే ప్రయ్తనం చేయగా దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత బంగారం, డబ్బుతో పారారయ్యారు. ఈ కాల్పుల్లో సుఖ్ దేవ్, కల్యాణ్ సింగ్ గాయపడ్డారు.

హెల్మెంట్
బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులు బంగారంతో పాటు, డబ్బును తీసుకుని పారిపోయారు. సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు తెలిసింది. పల్సర్ బైక్ వెళ్లిన నిందితుల్లో ఒకడు హెల్మెంట్ పెట్టుకోగా.. మరొకడు మాస్క్ వేసుకున్నాడు. పోలీసులు ఈ బంగారం దుకాణం చుట్టుపక్కాలతో పాటు ఆ ప్రాంతం నుంచి ఎటువైపు రూట్ ఉందో ఆ రూట్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications