హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chain Snatching: ఫుడ్ డెలివరీ బాయ్‍గా వచ్చి చైన్ స్నాచింగ్..

హైదరాబాద్ లంగర్ హౌజ్ ఫుడ్ డెలివరీ బాయ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ పెరిగిపోతున్నాయి. దీంతో మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు. తాజాగా లంగర్ హౌజ్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. నిందితుడిని నిజామాబాద్ కు చెందిన సయ్యద్ హమీద్ గా గుర్తించారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు, బైక్, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 జనవరి 23న

జనవరి 23న

'ఐదేళ్ల క్రితం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన హమీద్ సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. జనవరి 23 సాయంత్రం హమీద్ లంగర్ హౌజ్‌లోని ఓ ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. జనవరి 9న హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్ లు జరిగాయి.

ఉప్పల్‌లో మొదలుపెట్టి

ఉప్పల్‌లో మొదలుపెట్టి


మొదటగా ఉప్పల్‌లో మొదలుపెట్టి.. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలు చేశారు. ఉప్పల్‌ పరిధిలోని రాజధాని థియేటర్ ప్రాంతంతో పాటు కల్యాణ్‌పురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, హబ్సిగూడలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులులాక్కెళ్లారు. ఇదంతా గంటలో చేశారు.

6 చోట్ల చైన్ స్నాచింగ్

6 చోట్ల చైన్ స్నాచింగ్


దొంగలు మొదటగా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి దానితోనే దొంగతనాలకు పాల్పడ్డారు. తొలుత ఉప్పల్‌ చౌరాస్తా సమీపంలో ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు. ఆ వెంటనే కల్యాణిపురి కాలనీలో ఓ వృద్ధురాలి గోలుసును లాక్కుపోయారు. ఆ తర్వాత హబ్సిగూడ రవీంద్రనగర్‌లో జానకమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి మరో గోలుసు కొట్టేశారు. ఇలా 6 చోట్ల చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు.

ఖాజీపేట

ఖాజీపేట


అనంతరం ప్యాడైజ్ కు చేరుకుని అక్కడ ద్విచక్ర వాహనాన్ని వదిలేశారు. అక్కడ ఆటో తీసుకుని కాచిగూడ ర్వైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. ఈ వరస దొంగతానాల్లో నలుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా యూపీకి చెందిన వారిగా నిర్ధారించారు. దొంగలు కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వారు వరంగల్ వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. ఖాజీపేట వెళ్తున్నట్లు అనుమానించి తనిఖీలు చేశారు. కానీ దొంగలు తప్పించుకున్నారు.

English summary
Chain snatching is increasing in Hyderabad. Because of this, women are afraid to go out alone. Recently chain snatching happened in Langar House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X