హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

HCA: హెచ్‍సీఏపై మరో కేసు నమోదు.. టైమ్ కంటే ముందే మ్యాచ్ స్టార్టయిందట..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈనెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించి హెచ్ సీఏ సెప్టెంబర్ 22న టికెట్లు విక్రయించింది. టికెట్ల విక్రయ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. దీనిపై సీరియస్ స్పందించిన పోలీసలు HCAపై మూడు కేసులు నమోదు చేశారు. తాగా మరో కేసు బుక్ చేశారు.

7:30 ఉండగా 7 గంటలకే

7:30 ఉండగా 7 గంటలకే

బేగంపేట్ పోలీసులు, హెచ్‌సీఏపై మరో కేసు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఫిర్యాదు రావడంతో ఈ కేసు నమోదైనట్టు సమాచారం. టికెట్ పై మ్యాచ్ ప్రారంభ సమయం 7:30 ఉండగా 7 గంటలకే ప్రారంభమైందని ఇటీవల బేగంపేట్ పీఎస్ లో ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. దీంతో టికెట్ పై HCAపై తప్పుడు టైమింగ్ ఇచ్చిందంటూ యువకుడు కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలిసింది.

4 కేసులు

4 కేసులు

దీంతో బేగంపేట పోలీసులు క్రికెట్ అసోసియేషన్ పై కేసు ఫైల్ చేశారు. తాజాగా నమోదైన కేసుతో HCAపై ఫైల్ అయిన కేసుల సంఖ్య 4 కు పెరిగింది. టికెట్ల విక్రయం ఆది నుంచి అస్పష్టంగానే ఉంది. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే టికెట్లు అమ్ముడుపోయానని చూపించడంతో అభిమానులు ఉసురుమన్నారు. ఆఫ్ లైన్ లో టికెట్లు కోసం జింఖాన గ్రౌండ్ కు వచ్చి ఇబ్బందుల పాలయ్యారు.

రోహిత శర్మ

రోహిత శర్మ

మ్యాచ్ సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయలేదని హెచ్ సీఏ ఆరోపణలు వచ్చాయి. కూర్చునేందుకు సీట్లు కూడా సరిగా లేవని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో రోహిత శర్మకు వేసిన కుర్చీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ కుర్చీ టెబుల్ కంటే చిన్నగా ఉండడంతో రోహిత్ ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కుర్చీ మార్చినా ఫలితం లేకపోయింది. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది.

English summary
Police registered another case against HCA. A case was filed on the complaint of a fan that the match started before time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X