Hyderabad: ఆ రోజు అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..!

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ ట్రాఫిక్ ఆంక్షలు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది. బాలానగర్, ఖైరతాబాద్ గణనాథులతో పాటు వివిధ గణపతుల శోభాయాత్ర కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నిమజ్జనం రోజు మాసబ్ ట్యాంక్ దాటి, వీవీ స్టాచ్యూ, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, చాదర్‌ఘాట్, ఐఎస్ సదన్, వైఎంసీఏ నారాయణగూడ, తార్నాకలు దాటి ఆర్టీసీ బస్సులు రావని అధికారులు తెలిపారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే వారు లేదా వెళ్లేవారు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ దారుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. బదలు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఎయిర్ పోర్టు చేరుకోవాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే వాహనాలను బేగంపేట్, ప్యారడైజ్ ఫ్లై ఓవర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.

Police will impose traffic restrictions in many areas of Hyderabad on the immersion day

కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, ఇంజిన్ బౌలీ, శంశీర్‌గంజ్, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొగల్‌పురా, లక్కడ్ కోటె, పంచ్ మొహలా, పారిస్ కేఫ్, గుల్జర్ హౌజ్, మిట్టి కా షేర్, కాలి కమాన్, ఒస్మాన్ బజార్, షెరాన్ హోటల్, మదీనా క్రాస్ రోడ్స్, నయాపూల్, ఎస్ జే రోటరీ, అర్మాన్ హోటల్, ఎంజే బ్రిడ్జీ, దారుల్ షిఫా క్రాస్ రోడ్స్, సిటీ కాలేజీ, శివాజీ బ్రిడ్జీ, అఫ్జల్ గంజ్, పుత్లి బౌలి క్రాస్ రోడ్స్, ట్రూప్ బజార్, జాంబాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రా బ్యాంక్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

తోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, అజంతా గేట్, అబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, చాపెల్ రోడ్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, జీపీవో అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి స్టాచ్యూ, కవాడిగూడ, నారాయణగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

బాలాపూర్‌ గణేశుడి నిమజ్జనం కోసం పోలీసులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. దాదాపు 19 కిలోమీటర్లు శోభాయాత్ర జరగనుంది. దీనికి భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జనం జరిగే 56 చెరువుల దగ్గర ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+