హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంక్రాంతి శోభ: తెలుగు లోగిళ్లకు కొత్త వెలుగు.. విష్ చేసిన సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండగ.. పొంగల్ పురష్కరించుకొని తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇళ్ల ముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి , అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరించారు.

ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు కొలువుదీరుతున్నాయి. హరిదాసు కీర్తనలు, బసవన్నల నాట్యాలు, పతంగుల రెపరెపలతో పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. నిన్న భోగిమంటలు వెలిగించి పండగకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. ఇవాళ మకర సంక్రాంతి జరుపుతున్నారు. రేపు కనుమతో సంక్రాంతి పూర్తవుతుంది. ఏపీ, తెలంగాణలో నిన్న భోగి వేడుకలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంలు వేసి.. చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగిమంటలు వెలిగించి.. పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. భోగి మంటల్లో పాత సామాగ్రి వేసి అగ్ని దేవున్ని ప్రార్థిస్తున్నారు.

భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నారు. వాడవాడలా చిన్నాపెద్దా సందడి చేశారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. గంగిరెద్దుల ఆటపాటలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇటు బోర్డర్‌లో గస్తీ కాస్తున్న జవాన్‌లు కూడా సరిహద్దుల్లోనే భోగి మంటలు వెలిగించి డ్యాన్సులు చేశారు.

భోగి మంటలు వేసి అంతా ఉత్సాహంగా గడిపారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో చేరుకునే రోజు. భోగి పండగ సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. భోగి రోజున తెల్లవారు జామునే లేచి.. అభ్యంగ స్నానమాచరించి.. కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

pongal festive eve of telugu states

ఇటు తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగతో మీ పాడి, పంటలు బాగుండాలని.. జనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఇటు ఏపీ సీఎం జగన్ కూడా ప్రజలకు విష్ చేశారు.

English summary
pongal festive eve of telugu states and cm kcr wish to people happy sankranti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X