Droupadi Murmu: హైదరాబాద్‍కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవు, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతి కుమారి స్వాగతం పలికారు.

ద్రౌపది ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. 5 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముర్ము తన పర్యటనలో భాగంగా రెండు యూనివర్సిటీల స్నాతకోత్సవాల్లో పాల్గొంటారు.

President Draupadi Murmu

ముర్ము మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియానికి వెళ్తారు. అక్కడ అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. బుధవారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ద్రౌపది ముర్ము జూన్‌ 17న దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. శీతాకాలంలో కూడా రాష్ట్రపతి హైదరాబాద్ వస్తారు. బోల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొద్ది రోజులు ఉండి వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+