ఆ నలుగురికి ఉరే సరి, కోర్టులో వారి తరఫున వాదనలు వినిపించొద్దు, లాయర్లకు ప్రియాంక తండ్రి రిక్వెస్ట్
ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి కోరుతున్నారు. కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించడాన్ని స్వాగతించారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేసి, నిందితులకు శిక్ష ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నానని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

వాదనలు వినిపించొద్దు.. ప్లీజ్..
మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిందితుల తరఫున ఎవరు వాదనలు వినిపించొద్దని శ్రీధర్ రెడ్డి కోరారు. తన విన్నపానికి లాయర్లు సహకరిస్తే రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నిందితులు ఎవరో తమకు తెలియదని.. బండి పెట్టి వెళ్లగానే చూసి వేచి చూశారని పేర్కొన్నారు. లారీ లోడ్ కాకపోవడంతోనే ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితులకు ఉరి శిక్షతో తన బిడ్డ ఆత్మ శాంతిస్తోందని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

వెన్నులో వణుకు
ప్రియాంక ఘటనతో అమ్మాయిలను బయటకి పంపించాలంటే భయమేస్తోందని శ్రీధర్ రెడ్డి అన్నారు. తమకు మరో పాప ఉందని, డ్యూటీకి పంపించాలంటే భయపడుతున్నామని చెప్పారు. విశ్వనగరిలో భద్రత డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దీంతోపాటు పిల్లలపై పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలని సూచించారు.

అవగాహన కల్పించాలి
ఒకవేళ బస్సు లేటయితే ఎలా వెళ్లాలి. ఎవరి సాయం తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధిస్తేనే ప్రియాంక ఆత్మ శాంతిస్తోందని చెప్పారు. కోర్టులో లాయర్లు వాదనలు వినిపించొద్దని శ్రీధర్ రెడ్డి విన్నవించారు.

ఇదీ విషయం
ప్రియాంక వాహనం తీసుకొని వచ్చాక లారీ వెనకాలకు ఆరిఫ్, చెన్నకేశవులు తీసుకెళ్లారని చెప్పారు. నోరుని మూసివేసి లైంగికదాడి చేశారని చెప్పారు. ఆ తర్వాత నవీన్, శివ కూడా లైంగికదాడి చేశారన్నారు. లైంగికదాడి చేసే సమయంలో ముక్కు మూయడంతో ప్రియాంకరెడ్డి చనిపోయారని తెలిపారు. తర్వాత మృతదేహాన్ని లారీలో వేసి.. మరోచోటికి తీసుకెళ్లారని.. వెనకాల నవీన్, శివ స్కూటీ మీద వచ్చారని వివరించారు.

10.30 గంటలకు..
రాత్రి 10.30 గంటలకు వారు బయల్దేరారని చెప్పారు. అలా ప్రియాంకను నిర్జీవ ప్రదేశంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని పేర్కొన్నారు. స్కూటీని కూడా 10 కిలోమీటర్ల దూరంలో వదిలివేశారని చెప్పారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నామని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆధారాలు సమర్పిస్తామని సీపీ సజ్జనార్ చెప్పారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications