Priyanka reddy murder:నల్లబ్యాడ్జీలతో వెటర్నరీ వైద్యుల నిరసనలు, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం..
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యను పౌర సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రియాంక హత్యను నిరసిస్తూ తెలంగాణతోపాటు ఏపీలో కూడా వెటర్నరీ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ప్రియాంకను గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. షాద్‌నగర్, విజయవాడలో వెటర్నరీ వైద్యులు నిరసన తెలిపారు.

నిందితుల అరెస్ట్..
ప్రియాంకరెడ్డిపై సాముహిక లైంగికదాడికి పాల్పడి హతమార్చిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి దుండగులు ఆకృత్యానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు అహ్మద్ పాషాను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నవీన్, క్లీనర్లు శివ, పాషాను కూడా సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక హత్యకు సంబంధించి విచారిస్తున్నారు.

వెటర్నరీ వైద్యుల మానవహారం
షాద్‌నగర్‌లో వెటర్నరీ వైద్యులు ఆందోళన చేపట్టారు. ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ మానవహారం చేపట్టారు. ప్రియాంకను హతమార్చిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇటు విజయవాడలోనూ వెటర్నరీ వైద్యులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు కట్టి నిరసన తెలిపారు. నిందితులకు తగినశాస్తి చేయాలని కోరుతున్నారు. భవిష్యత్‌లో మరో అమ్మాయికి ఇలా చిత్రవధ చేసేందుకు కీచకులు భయపడాలని అంటున్నారు.

అంబేద్కర్‌కు వినతిపత్రం
ప్రియాంకరెడ్డి హత్యను నిరసిస్తూ విద్యార్థులు కూడా ఆందోళన బాటపట్టారు. ప్రియాంక హత్యకు సంబంధించి అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాత.. కీచకులు కఠినశిక్షలు అమలు చేయాలని కోరారు. పలు చోట్ల విద్యార్థులు రహదారులపై ఆందోళనకు దిగారు. విశ్వనగరిలో మహిళలకు రక్షణేదీ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

పథకం ప్రకారమే..
ప్రియాంక స్కూటీని అహ్మద్ పాషా అండ్ కో ఫాలో అయినట్టు తెలుస్తోంది. ఆమె వచ్చి క్యాబ్‌లో వెళ్లాక.. స్కూటీని పంక్చర్ చేశారని సమాచారం. ఆమె వచ్చాక.. పంక్చర్ చేయిస్తామని ముందుకొచ్చారు. బండి తీసుకొని వెళ్లి.. పంక్చర్ షాపు లేదని నటించినట్టు ప్రాథమికంగా పోలీసులు వెల్లడించారు. తర్వాత అక్కడినుంచి ఆమెను తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications