జీవిత పరాజయం - 7 ఓట్లతో గెలిచిన రఘుబాబు : శివబాలాజీ విజయం- కొనసాగుతున్న విష్ణు టీం ఆధిక్యత..!!
"మా " ఎన్నికల్లో తొలి నుంచి క్రియా శీలకంగా ఉన్న జీవిత రాజశేఖర్ ఓడిపోయారు. తాజా మాజీ కార్యవర్గంలో నరేశ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీవిత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే, తొలుత అధ్యక్ష బరిలో నిలిచినా..తరువాత ప్రకాశ్ రాజ్ కు మద్దతు ప్రకటించారు. దీంతో..ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసారు. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో జీవిత పైన విష్ణు ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన రఘుబాబు ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో రఘుబాబును అటు నరేశ్.. విష్ణు కౌంటింగ్ హాల్ లోనే ఆలింగనం చేసుకొని అభినందించారు.
ఇదే సమయంలో కోశాధికారి పదవి కోసం జరిగిన పోటీలో శివ బాలాజీ విజయం సాధించారు. ఈ పదవి కోసం జరిగిన పోటీలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన నాగినీడుకు 284 ఓట్లు రాగా.. శివ బాలాజీకి 316 ఓట్లు వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబూమోహన్,ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేశారు.
Recommended Video













Click it and Unblock the Notifications