మళ్లీ వాన.. నేడు హైదరాబాద్‌లో జల్లులు: వాతావరణ శాఖ
హైదరాబాద్ నగరంలో గురువారం సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది. గురువారం హైదరాబాద్‌లో 20.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 17.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనాల ప్రకారం.. శుక్ర, శనివారాల్లో 2.5 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై, చల్లని గాలులు వీచాయి. కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది.

ఈ సారి వర్షాలు ఎక్కువే కురిసాయి. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక ఏపీ గురించి అయితే చెప్పక్కర్లేదు. మొన్నటివరకు కురిసిన వర్షాలతో అక్కడి ప్రజల బాధ వర్ణణాతీతం. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతలు సమయంలో భారీ వర్షాలు కురిసాయి. తిరుమల, తిరుపతి.. చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణం. తమిళనాడు భారీవర్షాలతో అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. చెన్నైలోని చాలా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం నుంచి కోలుకోలేదు.
ఇటు ఏపీలో వానలు కురిసే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా ఇంకా కోలుకోలేదు. నెల వ్యవధిలో రెండు సార్లు అతి భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోవడం లేదు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
-
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
మార్చిలోనే మంటలు! 38 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications