మరో మూడురోజులు తెలంగాణాలో వర్షబీభత్సం: నేడు 12జిల్లాలలో భారీవర్షాలు.. తాజా పరిస్థితి ఇదే!!
తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇంకా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
దక్షిణ ఒరిస్సా ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి ఒరిస్సా తీర పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉందని ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాతావరణ శాఖ వర్షాలు కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఈ పన్నెండు జిల్లాల్లో భారీ కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ పన్నెండు జిల్లాల్లో భారీ కురిసే అవకాశం ఉన్నట్లు గా పేర్కొంది.

8 జిల్లాలలో అతి భారీ వర్షాలు.. మరో 5 జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు
ఇక మరో ఎనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్లో తేలికపాటి వర్షం
ఇక హైదరాబాద్లో ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉంటే నిన్న అర్ధరాత్రి వరకు కరీంనగర్ జిల్లా రామడుగు లోని గుంది ప్రాంతంలో అత్యధికంగా 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. చొప్పదండి లోని ఆర్నకొండ ప్రాంతంలో 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలు .. వరదలతో భయం గుప్పిట్లో సామాన్యులు
గత వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వానలతో నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి . దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరడంతో, అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి, ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ముంపుకు గురవుతున్న ప్రాంతాల ప్రజలు వర్షాల దెబ్బకు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications