రాజా సింగ్‌కు బెయిల్ మంజూరు
రాజా సింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహ్మద్ ప్రవక్తపై కామెంట్లకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కోర్టులో రాజా సింగ్, పోలీసుల తరఫున వాదనలు జరిగాయి. తొలుత 14 రోజుల రిమాండ్ అనే వార్తలు వచ్చాయి. కానీ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తర్వాత రాజా సింగ్ తరఫు లాయర్ తెలిపారు.
ఏ వ్యక్తిని అయినా అదుపులోకి తీసుకునే ముందు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలి. సదరు అధికారి వివరణ తీసుకోవాలి.. సంతృప్తి చెందకుంటే అరెస్ట్ చేయాలి.. కానీ రాజా సింగ్ విషయంలో అలా జరగలేదు. ఇదే విషయాన్ని రాజా సింగ్ తరఫు న్యాయవాది కోర్టులో బలంగా వినిపించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆర్గ్యూ చేశారని తెలిసింది. పోలీసుల తరఫు లాయర్ వాదనలు విన్న ధర్యాసనం.. రాజా సింగ్ తరఫు లాయర్ వాదనతో ఏకీభవించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బెయిల్‌పై బయటకు రానున్నారు.

అంతకుముందు నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజా సింగ్ అనుకూల (అభిమానులు) వ్యతిరేక (ఎంఐఎం) కార్యకర్తలు నినాదాలు చేశారు. చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు.
ఇటీవల హైదరాబాద్‌కు మునావర్ ఫరూఖీ వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కూడా ఆ షోకు హాజరయ్యారు. షో నిర్వహించొద్దని రాజా సింగ్ విన్నవించారు. అయినా షో నిర్వహించడంతో వీడియో పోస్ట్ చేశారు. అందులో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నాయట. రాజా సింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. దీంతో బీజేపీ హైకమాండ్ స్పందించింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications