రకుల్, రాణా.. ఇతర ప్రముఖులకు ఈడీ సమన్లు
డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు ఈ నెల 31 నుంచి ఈడీ విచారణ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్,నందు, శ్రీనివాస్ కు ఈడీ సమన్లు ఇచ్చింది.
పూరి జగన్నాథ్ ఆగస్టు 31 విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు, ఛార్మి సెప్టెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6, రానా దగ్గుబాటి సెప్టెంబర్ 8, రవితేజ, శ్రీనివాస్ సెప్టెంబర్ 9, నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15, తనీష్ సెప్టెంబర్ 17, నందు సెప్టెంబర్ 20, తరుణ్ సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని తెలిపింది.

డ్రగ్స్ కేసుకు సంబంధించి హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ.. పోలీసులు ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్‌తోపాటు పలువురు ప్రముఖులను స్పెషల్ సెల్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను సైతం పోలీసులు సేకరించి పరీక్షలకు పంపించారు.
Recommended Video
హీరో రవితేజ సోదరుడు భరత్ మరణించిన అనంతరం.. అతని మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు మాదకద్రవ్యాల రాకెట్‌పై దృష్టిసారించారు. ఈ క్రమంలో విచారణ అనంతరం 2 జులై, 2017న 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 30 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మంది డ్రగ్ విక్రేతలను పోలీసులు అరెస్టు చేసి పలు వివరాలను సేకరించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం తెలంగాణ పోలీసులు కోర్టుకు తమ నివేదికను సమర్పించారు. ఈ నివేదికను కోర్టు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications