హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీరామ నవమి ఎఫెక్ట్: 2 రోజులు వైన్స్ బంద్, మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఎక్కడ అంటే..?

|
Google Oneindia TeluguNews

శ్రీరామ నవమి రేపు.. భద్రాచలంలో రాములొరి కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సీఎం అందజేస్తారు. నవమి సందర్భంగా హైదరాబాద్‌తోపాటు భైంసాలో శోభాయాత్ర నిర్వహిస్తారు. యాత్ర సందర్భంగా ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. భాగ్యనగరంలో వైన్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైన్ షాపులకు ఆదేశాలు జారీచేశారు.

2 రోజులు వైన్స్ బంద్

2 రోజులు వైన్స్ బంద్

శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర కోసం శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో వైన్ షాపులు క్లోజ్ అవుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు. హైదరాబాద్, భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌, భైంసాలో పోలీసుల మార్గదర్శకాల మేరకు శోభయాత్ర నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించాలి. ఈ మేరకు నిర్వాహకులకు హైకోర్టు స్పష్టం చేసింది.

సిటీలో ఇలా..

సిటీలో ఇలా..

హైదరాబాద్‌లో సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించుకునే వీలు కల్పించింది.. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు, ధూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి చౌరస్తా మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

భైంసాలో శోభాయాత్ర ఇలా..

భైంసాలో శోభాయాత్ర ఇలా..


సిటీలో అలా ఉండగా భైంసాలో గోపాలదాస్ హనుమాన్ ఆలయం, పాత సోనా చాందినీ, కుబేర్ అడ్డా, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా, రాంలీలా మైదాన్ మీదుగా ఊరేగింపు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. శోభాయాత్రకు 200 మంది వరకు అనుమతి ఉంటుందని షరతు విధించింది. మధ్యాహ్నం లోపు యాత్రను ముగించాలని స్పష్టంచేసింది. పోలీసు బందోబస్త్ మధ్య శోభాయాత్రకు అనుమతి మంజూరు చేసింది.

రెండేళ్ల తర్వాత

రెండేళ్ల తర్వాత

కరోనా వైరస్ ప్రభావం తర్వాత ఇప్పుడు శోభాయాత్ర జరగనుంది. అంతకుముందు కూడా జరిగినా.. ఇతరులు గొడవ చేస్తారెమోనని తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. ఎప్పుడూ మధ్యాహ్నం వరకే అనుమతి ఇచ్చేవారు. ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుంది. కానీ అప్రమత్తంగా ఉండాలని పోలీసుశాఖను కోర్టు స్పష్టంచేసింది. మరోవైపు శోభాయాత్ర కోసం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

English summary
today 6pm onwards liquor shops are closed at hyderabad city due to sri rama navami shobha yatra. liquor shops remain open monday evening after 6pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X