హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామప్పకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా

|
Google Oneindia TeluguNews

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వహోదా దక్కింది. తెలంగాణలో గల పాలంపేటలో ఆలయాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల డాక్యూమెంట్లను యునెస్కోకు పంపించారు. వాటిని పరిశీలించిన కమిటీ రామప్ప దేవాలయానికి వారసత్వ హోదాను కట్టబెట్టింది. నార్వే అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. రష్యా భారత్‌కు సపోర్ట్ చేసింది.

కాకతీయ అద్భుత శిల్పకళకు నిదర్శనం ఆలయం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. భారత్‌లో యునెస్కో గుర్తించిన వారసత్వ సంపదలో రామప్ప 39 సైట్‌గా ఉంది. చైనాలో 44వ వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సమావేశం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రామప్పకు సంబందించిన అన్ని డాక్యూమెంట్లను కమిటీకి పంపింది. ఇంజినీరింగ్ నైపుణ్యానికి కళా సౌందర్యానికి చెక్కుచెదరని సాక్ష్యం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుడి సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ramappa world heritage site

ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్యయుగానికి చెందిన శివాలయం, దైవంపేరు మీదుగా కాక ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడ విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఆలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది.

కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. ఇదీ ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలో గల పాలంపేట అనే గ్రామంలో ఉంది. రామప్పను రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెబుతారు. ఆలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.

English summary
ramappa temple world heritage site committee announced today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X