హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.2 వేలు, బియ్యంతో ఇల్లు గడుస్తోందా..? ప్రైవేట్ టీచర్లకు సాయంపై విజయశాంతి ఫైర్

|
Google Oneindia TeluguNews

సందు దొరికితే చాలు సీఎం కేసీఆర్‌పై రాములమ్మ విజయశాంతి మండిపడుతున్నారు. ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం, బియ్యంపై కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్నీ వర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై పైర్ బ్రాండ్ విజయశాంతి కూడా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

 ఏ మూలకు సరిపోతుంది..?

ఏ మూలకు సరిపోతుంది..?

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని 1.45 లక్షల మంది ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తెలిసిందే. గత కొన్నినెలల నుంచి రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల పరిస్థితి దయనీయంగా తయారైందని తెలిపారు. టీచర్ల వరుస ఆత్మహత్యలు, పాలకుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వచ్చాయి. దీంతో కంటితుడుపు చర్యగా రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆ నగదు ఏ మూలకు సరిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు.

 30 మంది వరకు సూసైడ్ అటెంప్ట్

30 మంది వరకు సూసైడ్ అటెంప్ట్

వైరస్ వ్యాప్తి వల్ల 30 మంది టీచర్లను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇతరులు ఉద్యోగాలు కోల్పోయారని, కుటుంబ పోషణ కోసం బండ్లు నడుపుకుంటూ, కూరలు అమ్ముకుంటూ, కూలీలుగా మారిపోయారని వివరించారు. దీనిపై మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయని, అప్పుడే సర్కారు మేల్కొని ఉంటే, తమకు సర్కారు అండగా ఉంటుందన్న భరోసా కాస్తయినా ఇచ్చి ఉంటే ఇవాళ ఇన్ని ప్రాణాలు పోయేవి కావని విజయశాంతి వ్యాఖ్యానించారు.

గురువుకు ఉన్నతస్థానం

గురువుకు ఉన్నతస్థానం

ప్రభుత్వ టీచర్లు అయినా, ప్రైవేటు టీచర్లు అయినా సమాజంలో గురువు స్థానం ఎప్పటికీ ఉన్నతమైనదేని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని, కాస్త డబ్బు, బియ్యం ఇవ్వగానే వారి కన్నీరు ఆగదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీచర్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించినప్పుడే వారికి నిజమైన సంతృప్తి కలుగుతుందని, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించాలని హితవు పలికారు.

బియ్యం కూడా

బియ్యం కూడా


గుర్తింపు పొందిన ప్రైవేట్‌ విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందికి సాయం అందనుంది. రేషన్‌ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం సరఫరా చేస్తారు. టీచర్లు, సిబ్బంది బ్యాంక్‌ అకౌంట్ వివరాలను కలెక్టర్లకు ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షా 45 వేల మంది ప్రైవేట్‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది లబ్ధి పొందుతారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నమని సీఎం కెసిఆర్ తెలిపారు.

భర్త, భార్య మృతి

భర్త, భార్య మృతి

సీఎం కేసీఆర్ ప్రకటన కన్నా ముందు విషాదం జరిగింది. నాగార్జున సాగర్‌లో ప్రైవేట్ టీచర్ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్స్ క్లోజ్ చేయడం, ఉపాధి లేకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఇంకేముంది జీవితం చాలు అనుకొని రెండురోజుల క్రితం సూసైడ్ చేసుకున్నాడు. ఆయన లేని లేటును భార్య జీర్ణించుకోలేకపోయింది. నిన్న ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా వల్ల స్కూల్ మూసివేయడంతో.. ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారు అయిపోయారు. జగిత్యాల టీచర్ కూడా సీఎంకు వీడియో పోస్ట్ చేశారు.

Recommended Video

#Telangana severe Heatwaves : High Temperatures In Telangana మండుతున్న ఎండలు

English summary
ramulamma vijaya shanti slams cm kcr on private teachers rs.2k, rice issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X