రవికుమార్ మెడికల్ ఖర్చు భరిస్తాం: వైఎస్ షర్మిల భరోసా, దీక్ష భగ్నంపై పైర్

రైతు ఆత్మహత్యపై శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ నియంత పాలనను నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటలకు మీడియా మిత్రులతో మాట్లాడారు. రవికుమార్ ఆత్మహత్యపై శాంతియుతంగా దీక్షచేస్తుంటే అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. దీక్షా భగ్నం చేయడాన్ని తప్పుపట్టారు. రవికుమార్ భార్యకు గుండెనొప్పి ఉందన్నారు. తల్లిదండ్రులు వృద్ధులు.. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పింఛన్ కూడా రాదన్నారు. రవికుమార్ కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిమా ఫాలింగ్ వ్యాధి వల్ల రక్తం వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదని వివరించారు. ఆ అబ్బాయికి మెడికల్ ఖర్చు చాలా అవుతుందన్నారు. రవికుమార్ కుటుంబానికి రూ.50 లక్షల వరకు అప్పులే ఉన్నాయని వివరించారు.

రవికుమార్ అనే రైతు దిగుబడి తక్కువగా రావడంతో నష్టానికి వరి ధాన్యం అమ్ముకోవడం జరిగింది. ఇది ఆత్మహత్యా..కేసీఆర్ హత్యా..? వరి ఆకరి గింజ వరకు కొంటానని, ఇప్పుడు కేసీఆర్ కొనబోమని చెబుతున్నారు. కేసీఆర్ వరి వేసుకోనిచ్చి ఉంటే రవికుమార్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ముమ్మాటికీ రవికుమార్ చనిపోవడానికి కారణం కేసీఆర్..చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాలేరు. కేసీఆర్ రాజీనామా చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఈ పాపం పోయేది కాదు. కనీసం ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవికుమార్ అబ్బాయి మెడికల్ కు ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించకపోవడంతో 48లక్షల రూపాయల అప్పుభారం ఆ కుటుంబంపై పడింది. మొత్తం కుటుంబం భారం రవికుమార్ పై పడటంతో అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే ఉన్న ఇల్లు, భూమి పోతుంది. కుటుంబం మొత్తం రోడ్డున పడి మేం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని ఆ కుటుంబం మొత్తం ఏడుస్తూ చెప్పింది. ఇది ఆ కుటుంబం చెప్పిన మాటే కాదు ఆ గ్రామ ప్రజలంతా రవికుమార్ ఆదర్శ రైతు అని, వారిని ఆదుకోవాలన్నారు.

ravi kumar family medical expenses bare ysrtp:ys sharmila

రైతుబంధు పేరుతో ఇస్తుంది రూ.5000 అయితే పట్టుకుంటున్నది రూ.25000. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మీ, విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వడం లేదు. ఎకరానికి రూ.25000 పట్టుకుంటున్నారు. రైతులకు ఏ విధంగా కేసీఆర్ న్యాయం చేస్తున్నారు. వరి వేసుకోవద్దనే హక్కు కేసీఆర్ కు లేదు. కొనుగోలు సెంటర్లు అన్నీ ప్రారంభం కాలేదు. కేవలం 30 శాతం మాత్రమే వరి ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు ఎన్ని వడ్లు పండించినా వాటికి మద్దతు ధర కల్పించాలన్నారు.రవి కుమార్ ఇంట్లో పుట్టిన నినాదం వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు, వరి కొనమన్న ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. కేంద్ర రైట్ అని నేను చెప్పడం లేదు. కేంద్రంతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+