హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రీ కాల్ చేయండి: తమిళి సై వైఖరిపై నారాయణ ఫైర్, మంత్రి సత్యవతి విసుర్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌‌పై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ కౌంటర్ అటాక్ మొదలైంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథొడ్ కామెంట్స్ చేశారు. విచిత్రంగా సీపీఐ నారాయణ కూడా ఎదురుదాడికి దిగారు. గవర్నర్ వ్యవస్థ గురించి ఆయన కామెంట్ చేశారు.

 లక్ష్మణ రేఖ దాటారు..

లక్ష్మణ రేఖ దాటారు..


గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని సీపీఐ నారాయణ కామెంట్ చేశారు. బీజేపీ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ పదవే పనికిమాలినదని ఒకింత ఘాటుగానే స్పందించారు. గవర్నర్ ముసుగులో ఉన్న బీజేపీ నేత తమిళిసై అని మండిపడ్డారు. ఆమెను రీకాల్ చేయాలని కోరారు. బీజేపీ నాయకులను గవర్నర్‌ను చేస్తే ఇలానే ఉంటుందని ఫైరయ్యారు.

మంత్రి ఫైర్

మంత్రి ఫైర్


ఇటు మంత్రి సత్యవతి రాథొడ్ కూడా ఎదురుదాడికి దిగారు. గవర్నర్ తమిళిసై పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఎందుకు దక్కడం లేదో గవర్నర్ సమీక్షించుకుంటే మంచిదన్నారు. ఏ గవర్నర్‌తో రాని ఇబ్బందులు తమిళిసైతోనే వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వం చేసే వేడుకల్లో పాల్గొంటానడంలో గవర్నర్ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు.

గవర్నర్ ఫైర్

గవర్నర్ ఫైర్


అంతకుముందు సీఎం కేసీఆర్‌‌పై గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ ఫైరయ్యారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం అన్ని అవకాశాలను వదులుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని పదే పదే చెబుతున్న కేసీఆర్ దక్షాణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్నారు. సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందని, ప్రభుత్వం చాలాసార్లు తనను ఇబ్బందిపెట్టిందన్నారు. అయినా తాను భయపడలేదని చెప్పారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు.

 గౌరవం ఇవ్వలే

గౌరవం ఇవ్వలే


తనతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఎంటన్నారు. మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, ఒక మహిళగా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వాన్ని హెలీకాఫ్టర్ అడిగితే ఇవ్వలేదన్నారు. చివరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. అయినా నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ దగ్గరకు చేరానని గవర్నర్ తమిళి సై తెలిపారు.

English summary
recall the governer cpi narayana asked to central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X