హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి.!నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలన్న భట్టి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్ర రైతాంగం అతలాకుతలం అయ్యిందని, తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం సంసిద్దంగా ఉండాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అంతే కాకుండా రాష్ట్రంలో జన జీవన శ్రవంతి అస్థవ్యస్థమైనందున యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని,
యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు భట్టి.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. వరద బాదితులను ఆదుకోవాలన్న సీఎల్పీ నేత

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. వరద బాదితులను ఆదుకోవాలన్న సీఎల్పీ నేత

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, క్షేత్రస్థాయికి పంపించి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గోదావరి నది జలాల మీద ఉన్న ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసిన నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గోదావరి తీరంలోని ఆయా గ్రామాల్లో రాకపోకలు స్తంభించిపోవడం వల్ల ప్రజలకు అత్యవసర సేవలు అందక పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ప్రభుత్వం వెంటనే వారికి అన్ని సహాయక చర్యలు అందించేందుకు కృషి చేయాలని భట్టి విక్రమార్క కోరారు.

రైతాంగానికి ఆపన్న హస్తం ఇవ్వాలి.. ప్రభుత్వానికి భట్టి సూచన

రైతాంగానికి ఆపన్న హస్తం ఇవ్వాలి.. ప్రభుత్వానికి భట్టి సూచన

అంతే కాకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగా ఇళ్ల నుండి ప్రజలు బయటకు రాలేని ప్రాంతాలను తక్షణం గుర్తించి అక్కడ ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలు అందించేలా కార్యచరణ ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను పంట పొలాల దగ్గరకు పంపించి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టపోయిన ప్రకారంగా రైతులకు పరిహారం అందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

సహాయక చర్యలు చేపట్టండి. టోల్ ఫ్రీ నంబర్ కు ప్రాచారం కల్పించాలన్న భట్టి.

సహాయక చర్యలు చేపట్టండి. టోల్ ఫ్రీ నంబర్ కు ప్రాచారం కల్పించాలన్న భట్టి.

వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయ చర్యలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు నిర్వాసితులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలు, పాలు సరఫరా చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

వరద ప్రాంతాల్లో పర్యటిస్తా.. బాదితులకు భట్టి భరోసా

వరద ప్రాంతాల్లో పర్యటిస్తా.. బాదితులకు భట్టి భరోసా

ఇదిలా ఉండగా వరద బాదితులకోసం, వరదల్లో చిక్కుకున్న వారి కోసం కాంగ్రెస్ పార్టీ టోల్ ఫ్రీ నంబన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిందన్నారు భట్టి విక్రమార్క. బాదితులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నంబర్ ను అందజేయాలని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకూ క్షేత్రస్ధాయిలో ఉండాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీగా బాద్యతాయుత పాత్రపోషించాలని పార్టీ ముఖ్య నేతలకు, కార్యకర్తలకు, శ్రేణులకు భట్టి విక్రమార్క సూచించారు. అవసరం అనుకుంటే పీసిసి అద్యక్షుడితో పాటు తాను కూడా వరద బాదిత ప్రాంతాలను సందర్మిస్తానన్నారు భట్టి విక్రమార్క.

English summary
CLP leader Bhatti Vikramarka said that the farmers of the state are suffering due to Heavy rains and the government should be ready to provide immediate assistance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X