హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Republic Day 2023: ప్రగతి భవన్‍లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పరేడ్‌ గ్రౌండ్‌లో అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించారు.

రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్‌ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఉండాలి కోరుకున్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకొంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకొన్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి సూచించారు. భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురసరించుకొని దేశ ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Republic Day was celebrated in Hyderabad Pragati Bhavan

అటు తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే ఆవిష్కరించారు.

Republic Day was celebrated in Hyderabad Pragati Bhavan

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్​ఎస్ నేతలు పాల్గొన్నారు.హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాయంత్రం గవర్నర్‌ ఇచ్చే విందుకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉంటారని తెలిసింది.

English summary
Republic Day was celebrated in Hyderabad Pragati Bhavan. CM KCR unveiled the national flag. Later they paid tribute to the portraits of Gandhi and Ambedkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X