రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి.. వీహెచ్ ఏం చేశారు..? ఫైర్
టీ కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి డైలాగ్ వార్ జరిగింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన సందర్భంగా గొడవ జరిగింది. యశ్వంత్ సిన్హా కు స్వాగతం పలికే కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు ఎవ్వరు వెళ్లవద్దని టీ.పీసీసీ తీర్మానించింది. తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు యశ్వంత్ సిన్హా స్వాగత కార్యక్రమానికి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. యశ్వంత్ సిన్హాను కలిసారు. దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వీహెచ్ పై ఫైర్ అయ్యారు.
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవ్వరు వ్యవహరించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వీహెచ్ పై చేసిన కామెంట్లపై మరో కాంగ్రెస్ నేత..ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ చేసిన తప్పేంటి? ఎయిర్ పోర్టుకు వెళ్లటంలో ఏమాత్రం తప్పు లేదని సమర్థించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే సమయంలో రాహుల్ గాంధీ ఆయన పక్కనే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి లేని అభ్యంతరం రేవంత్ రెడ్డికి ఎందుకు అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

వీహెచ్ యశ్ంత్ సిన్హాను కలిసింది ఎయిర్ పోర్టులో.. కేసీఆర్ ఇంటి దగ్గరకాదు కదా? అని ప్రశ్నించారు. యశ్వంత్ సిన్హాను కలవటానికి వెళ్లవద్దని చెప్పటానికి రేవంత్ రెడ్డి ఎవరు? ఆయనకు మేమేమన్నా పాలేరులుమా? సీనియర నేత అని కూడా చూడకుండా గోడకేసి కొడతాను అని అన్నందుకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలి అనా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications