ఈటల ఉత్తముడేం కాదు.. హరీశ్, కేసీఆర్‌పై రేవంత్ విసుర్లు

హుజురాబాద్ ఉప పోరు ప్రచారం మరింత హీటెక్కింది. వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్‌ ఉత్తముడు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్‌ ఉపఎన్నిక వచ్చిందన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రెండో రోజు రేవంత్ రెడ్డి ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.‌ వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అంటున్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనలేని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, మంత్రి హరీశ్‌రావు ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు.

లీటర్ పెట్రోల్‌పై రూ.65 పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయని తెలిపారు.‌ మోడీ, కేసీఆర్ కలిసి ప్రజలను పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న వారికి ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. పింఛన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి కసబ్‌గా మారి పారిపోయాడని, అందుకే అభ్యర్థి ఎంపికలో ఆలస్యమైందన్నారు.‌ ప్రజాసమస్యలు నిరుద్యోగ సమస్యలపై ఏడేళ్లుగా పోరాడుతున్న బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా తీసుకువచ్చామని ఓటు వేసి బల్మూరి వెంకట్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

 revanth reddy slams etela rajender

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+