కేసీఆర్ పెరెత్తని మోడీ గారి మిత్రధర్మం చూశారుగా.. టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఆసక్తికర మాటల యుద్ధంతో రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి, బీజేపీ విజయ సంకల్ప సభ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో కెసిఆర్ కు సంబంధించి ఎలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు లేకపోవడం, అసలు కెసిఆర్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించకపోవడం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

తన చీకటి మిత్రుడు కెసిఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా మోడీ స్పీచ్: రేవంత్ రెడ్డి
మోడీ, కెసిఆర్ పేరును ప్రస్తావించక పోవటం వ్యూహాత్మకం అని పలువురు భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కెసిఆర్ ను, మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మోడీగారి మిత్ర ధర్మం చూశారుగా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ మిత్రులారా తన చీకటి మిత్రుడు కెసిఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా, తాను చేసిన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్ కుటుంబ పాలన, కెసిఆర్ కుటుంబ అవినీతి ఊసెత్తకుండా మోడీ మిత్ర ధర్మం పాటించారని బీజేపీ, టీఆర్ఎస్ భాయ్ భాయ్ అంటూ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.

మోడీ ప్రసంగం లో ఎందుకు కెసిఆర్ అవినీతిని ప్రశ్నించలేదన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన శ్రీకాంతాచారి, జయశంకర్ లను ప్రస్తావించకుండా మోడీ ప్రసంగం సాగిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ అవినీతిపై బీజేపీ నేతలు మూడు సంవత్సరాలుగా మాటలు చెబుతున్నారని, మరి మోడీ ప్రసంగం లో ఎందుకు కెసిఆర్ అవినీతిని ప్రశ్నించలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాట్లాడిన నేతలు చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు.

మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తెలంగాణ ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మోడీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ఏ విధంగా ప్రసంగిస్తారని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ గడ్డపై ఉండి విభజనను ఆనాడు అమిత్ షా తప్పుబట్టారు అని మండిపడిన రేవంత్ రెడ్డి ప్రజలకు మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి మోడీ, కేసీఆర్ ఇప్పటి వరకు ఏం చేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

చదువు రాని వాడిని ప్రధాన మంత్రిని చేస్తే ఇలాగే ఉంటుందని ట్వీట్
ఇక ఇదే సమయంలో తెలంగాణా కాంగ్రెస్ కూడా మోడీ సభను టార్గెట్ చేసి ట్వీట్ చేసింది. చదువు రాని వాడిని ప్రధాన మంత్రిని చేస్తే.. గిట్లనే ఉంటది అంటూ ఆసక్తికర పోస్ట్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ మోడీ ముందు స్క్రీన్ లేనిదే ఒక్క ముక్క అయిన మాట్లాడతావా అసలు? అంటూ ఎద్దేవా చేసింది. నీ కన్న నాల్గో తరగతి పిల్లోడు బెటర్ రా అయ్యా అంటూ ప్రధాని మోడీ పై సెటైర్లు వేసింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications