మల్కజ్‌గిరిని మరో నోయిడాగా మారుస్తా... రేవంత్ రెడ్డి..
మల్కజ్‌గిరి నియోజకవర్గాన్ని మరో నోయిడాగా మారుస్తానని ఎంపీ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజవర్గంలో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఝతలు తెలిపారు. .నియోజకవర్గంతో పాటు, రాష్ట్ర్రంలోని సమస్యలపై పోరాడతానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఐరన్ ఇండస్ట్ర్రీ, తోపాటు గిరిజన విశ్వవిద్యాలయ సాధనపై పోరాడతామని తెలిపారు. విద్యార్థుల సపోర్టుతో రెవంత్ రెడ్డి సమీప టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డిపై పదివేల పైచీలుకు ఓట్ల మెజారీటీతో గెలుపోందిన విషయం తెలిసిందే...

ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఫై ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర్రాన్ని రాష్ట్ర్రంగా కాకుండా ఒక రాజ్యంగా భావించారని అందుకే తండ్రి కొడుకులకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు.ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును బాద్యతగా భావిస్తానని అన్నారు. ఇక ఎన్నికల్లో గెలుపుకు తాను చేసిన కృషికంటే విద్యార్థులు చేసిన పాత్ర ఎక్కువగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications