హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.300 వందల కోసం చూస్తే.. రూ.1.90 లక్షలు మాయం... సైబర్ కేటుగాళ్ల పనీ ఇదీ..

|
Google Oneindia TeluguNews

సైబర్ క్రైం కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆన్ లైన్ షాపింగ్.. ఇతరత్రా వల్ల కేటుగాళ్లు కొందరినీ బురిడి కొట్టిస్తున్నారు. వాస్తవానికి కార్డ్ నంబర్, ఓటీపీ నంబర్ చెప్పొద్దు అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా.. కొందరు అలానే చేస్తున్నారు. దీంతో ఖాతాలో ఉన్న నగదు కాస్త మాయం అవుతుంది. అలా హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ ఖాతా నుంచి కూడా భారీ నగదు కొట్టేశారు.

రూ.300 కోసం చూస్తే..

రూ.300 కోసం చూస్తే..


మూడు వందల కోసం ప్రయత్నించి సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కి రెండు లక్షల దాకా పోగొట్టుకుంది నగరానికి చెందిన ఓ మహిళ. జూబ్లీహిల్స్‌కు చెందిన విశాలాక్షి ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసింది. ఈకామర్స్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే కొరియర్‌ సంస్థకు చెందిన ప్రతినిధి వస్తువులను ఇంటికి వచ్చి అందజేశాడు. డబ్బులను ఆమె డెలివరీ బాయ్‌కు చెల్లించి రశీదు తీసుకుంది. అతను వెళ్లిపోయిన తర్వాత పీఓడీని పరిశీలించగా డెలివరీ బాయ్‌ తన వద్ద మూడు వందలు అదనంగా వసూలుచేసినట్టు గ్రహించింది.

నంబర్ స్విచాఫ్ రావడంతో..

నంబర్ స్విచాఫ్ రావడంతో..

అతని మొబైల్‌ నెంబర్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో గూగుల్‌సెర్చ్‌లో ఈకామర్స్‌ ఎక్స్‌ప్రెస్‌ కాల్‌సెంటర్‌ కోసం వెతికింది. ఒక నెంబర్‌ కనిపించడంతో ఫోన్‌ చేసింది. మీ డెబిట్‌ కార్డు వివరాలు, వ్యక్తిగత వివరాలు ఇస్తే మూడు వందలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని అవుతలివైపు వ్యక్తి చెప్పడంతో ఆమె అన్ని వివరాలు చెప్పింది. ఓటీపీ వివరాలు కూడా చెప్పింది. ఇక్కడే ఆమె పప్పులో కాలేసింది. అలా చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. క్షణాల్లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షా తొంభై ఒక్కవేలు ఖాళీ అయ్యాయి. ఆ వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.

చెప్పొద్దు అని చెప్పినా..

చెప్పొద్దు అని చెప్పినా..

కార్డు వివరాలు చెప్పొద్దు అని అంటూంటే ఏకంగా ఆమె ఓటీపీ కూడా చెప్పింది. ఖాతాలో ఉన్న రూ.1.90 లక్షలు చేజేతులా పొగొట్టుకుంది. వాస్తవానికి సైబర్ క్రైం పోలీసులు.. 24 గంటల్లోగా కేసును ఛేధిస్తారు. ఆ తర్వాత నైజీరియా.. ఇతర ప్రాంతాల్లో ఉండేవారి వివరాలు పట్టుకోవడం సాధ్యం కాదు. సో ఆన్ లైన్ షాపింగ్ చేయండి.. కానీ జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ ఖాతాలో ఉన్న నగదు మొత్తం చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది.

English summary
rs.1.90 lakhs theft by cyber crime hyderabad cops revealed incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X