సిటీలో రియల్ ఎస్టేట్ మోసం: రూ. 50 కోట్లతో యజమాని పరార్, బాధితుల ఆందోళన
హైదరాబాద్: నగరంలో మరో రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ఆశ చూపి అనేక మందిని మోసం చేసింది. రూ. లక్షలు కట్టి మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లోని మైత్రీ ప్రాజెక్ట్స్ కంపెనీ ఈ మోసానికి పాల్పడటంతో బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
రాయల్ లీఫ్, రాయల్ పారడైజ్, రాయల్ మింట్ అనే అందమైన పేర్లతో 300 మంది దగ్గర సుమారు రూ. 50 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు మైత్రీ ప్రాజెక్ట్స్ ఎండీ జానీ భాషా. రాత్రికి రాత్రే ఫ్యామిలీతో జంప్ అయ్యాడు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు ఆందోళన బాటపట్టారు.

హైదరాబాద్ మియాపూర్ అల్విన్ కాలీనలో మైత్రి ప్రాజెక్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు బాధితులు. మూడు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.
మోసపోయినవాళ్లంతా మధ్యతరగతి వారే కావడంతో.. తాము ఎంతో శ్రమించి కూడబెట్టుకున్న సోమ్మంతా కాజేశారని కన్నీరుపెట్టుకున్నారు తాము రూ. 20 లక్షల కట్టి మోసపోయామని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా.. ఎలాంటి చర్య తీసుకోలేదని బాధితులు వాపోయారు.












Click it and Unblock the Notifications