హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.6.80 కోట్ల నగదు, 4500 లీటర్ల లిక్కర్ సీజ్, మునుగోడు బై పోల్‌కు ఏర్పాట్లు రెడీ: వికాస్ రాజ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో హీటెక్కిస్తోన్న మునుగోడు బై పోల్ ప్రచార పర్వం రేపు సాయంత్రంతో ముగియనుంది. ఆ తర్వాత ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. ఇప్పటికే అక్కడ మద్యం ఎరులై పారుతోంది. నగదు ప్రవాహం కూడా కొనసాగుతోంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే.

 వి ఆర్ రెడీ

వి ఆర్ రెడీ

బై పోల్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు. రేపు సాయంత్రం ఆరు గంటల తరువాత నాన్ లోకల్ ఎవరు నియోజకవర్గంలో ఉండకూడదని స్పస్టంచేశారు. ఒకవేళ ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని తేల్చిచెప్పారు.

 చర్యలు తప్పవు

చర్యలు తప్పవు


ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగియనుందని తెలిపారు. నియోజకవర్గంలో 241855 మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారని వివరించారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. కొత్త డిజైన్ తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని.. ఫ్లైయింగ్ స్కాడ్ తో కలిసి మొత్తంగా యాబై టీం ఉన్నాయని తెలిపారు.

7 నుంచి పోలింగ్

7 నుంచి పోలింగ్


ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. 199 మైక్రో అబ్జర్వర్లు అందుబాటు లో ఉంటారని.. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. 3366 పోలింగ్ సిబ్బంది , 15 బలగాల సిబ్బంది మునుగొడులో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

111 బెల్ట్ షాపులు సీజ్

111 బెల్ట్ షాపులు సీజ్


111 బెల్ట్ షాపులను సీజ్ చేశామని తెలిపారు. 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని వివరించారు. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 185 కేసులు నమోదు చేశామని తెలిపారు. 6.80కోట్ల నగదు పట్టుబడిందని.. 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నామని తెలిపారు.ఇటు కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ అందిందని.. దీనిని ఈసీ నివేదిక పంపామని తెలిపారు. రిటర్నింగ్ అధికారిపై సీఈవో కార్యాలయం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు.

English summary
rs.6.80 crores cash and 4500 litre liquor seized in munugodu by poll sec vikas raj said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X