Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాళ్లు బాగానే ఉన్నారు... మధ్యలో బలైంది ప్రజలే... చార్జీల పెంపుపై కొత్త వాదన

ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి, కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. అంతకు ముందు కార్మికులపై కఠినంగా వ్యవరించిన సీఎం సమ్మె విరమణ అనంతరం వారితో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు కొరినట్టుగా వరాలు ప్రకటిస్తూనే... మరోవైపు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో సమస్య ప్రభుత్వానికి ఎదురవుతోంది. చార్జీల పెంపును ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. పలు జిల్లాల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

52 రోజుల ఆర్టీసీ సమ్మె ఫలితం....

52 రోజుల ఆర్టీసీ సమ్మె ఫలితం....

52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగించారు. రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకునే దసరా పండగ ముందు సమ్మెలోకి వెళ్లిన ఆర్టీసీ కార్మికులు, దీపావళి అయిపోయినా... సమ్మె కొనసాగింది. కాగా ఈ రెండు పండగల్లో ప్రజలు రవాణ చేసేందుకు అనేక ఇబ్బందులు బట్టారు. పండగలతో పాటు రోజువారిగా ఉద్యోగాలు చేసేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. సమ్మెతో ప్రైవేట్ వాహానాలపై ఆధారపడి అదనంగా ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు సమయానికి కూడ కార్యాలయాలకు వెళ్లిన పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగాల్లో కూడ కొతలు విధించిన పరిస్థితిని పలువురు ఫేస్ చేశారు.

కోర్టుల జోక్యంతో... సాగదీసిన సమ్మె

కోర్టుల జోక్యంతో... సాగదీసిన సమ్మె


అయితే ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా... ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు.. సమ్మె పరిష్కారానికి కోర్టుల చుట్టు తిరిగింది. దీంతో 50 రోజుల పాటు కేసు కొనసాగింది. ఈ నేపథ్యంలోనే సమ్మెకు వెళ్లిన కార్మికులు గాని, ప్రభుత్వం గాని వారికి మద్దతు పలికిన ఇతర ప్రతిపక్ష పార్టీలుగాని రోజువారిగా ప్రయాణం చేసే ప్రజలను మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. దీంతో సమ్మె ఎప్పుడు ముగుస్తుందా.. ఎప్పుడు ఇబ్బందులు తప్పుతాయా... అంటూ ప్రయాణికులు వేచి చూశారు. మొత్తం మీద కోర్టులు కూడ తామేమి చేయలేమని చేతులు ఎత్తేయడంతో....కార్మికులు దిగిరావడం కూడ సమ్మె ముగింపుకు అవకాశం లభించింది. సమ్మె కొనసాగిస్తే కార్మికులు మరింత నష్టపోయో పరిస్థతి కనిపించడంతో కార్మికులు దిగివచ్చి సమ్మెను ఎలాంటీ కండిషన్లు లేకుండా ముగించారు.

 ఆర్టీసీ కార్మికులకు సీఎం వరాలు

ఆర్టీసీ కార్మికులకు సీఎం వరాలు


కార్మికులు సమ్మెను ముగిస్తున్నట్టు ప్రకటించిన వారం రోజుల తర్వాత సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. మొత్తం 52 రోజుల పాటు అనేక అందోళనలు, ఇతర పరిణామాల తర్వాత ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరవచ్చంటూ సీఎం ప్రకటించారు. అనంతరం గత ఆదివారం కార్మికులతో నేరుగా సమావేశం అయి పలు వరాలు ప్రకటించారు. ముఖ్యంగా ఆర్టీసీకి రానున్న బడ్జెట్‌లో వెయ్యి కొట్ల రూపాయలు కేటాయిస్తానని సీఎం హామీ ఇవ్వడంతో పాటు మహిళ కార్మికులకు కూడ నైట్ షిప్ట్‌లు వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పదవి విరమణ వయస్సును కూడ 60 సంవత్సరాలకు పెంచారు. వరాల జల్లుతో కార్మికుల్లో సీఎంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని సంతోషంగా వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్నారు.

సమ్మె పేరుతో చార్జీల పెంపు...

సమ్మె పేరుతో చార్జీల పెంపు...


అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా... సమ్మె పేరుతో ప్రభుత్వం ప్రజలపై భారం వేసేందుకు తెరలేపింది. ఆర్టీసీని బతికించుకోవాలంటే చార్జీలు పెంచక తప్పదని ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ఆర్ధిక మాంద్యం రిత్యా ఆర్టీసీ నష్టాలను భరించే అవకాశాలు లేకపోవడంతో చార్జీల పెంపుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రతి కిలోమీటరుకు ఇరవైపైసలు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఆయా జిల్లాలతో పాటు హైదారాబాద్ నగరంలో నడిపై బస్సులపై కూడ ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడింది. మినిమం చార్జీని యాబై శాతం పెంచారు. నగరంలో కిలోమీటర్ల వారిగా కాకుండా కొంత చిల్లర సమస్యలు లేకండా పెద్ద ఎత్తున చార్జీలు పెంచారు.

చార్జీల పెంపుతో సీన్ రివర్స్

చార్జీల పెంపుతో సీన్ రివర్స్

అయితే చార్జీల పెంపుతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తుంది. సమ్మె చేసిన కార్మికులు , సమ్మెకు కారణమైన ప్రభుత్వానికి ఎలాంటీ భారం పడకుండా సమ్మె ముగిసింది. అయితే ఇద్దరు బాగానే ఉన్నా భారం మాత్రం ప్రజలమీద పడిందనే అభిప్రాయాంలో ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు ఆర్టీసీ కార్మికుల రూపంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తయి... చార్జీల పెంపుతో ప్రస్తుతానికి ప్రజల నుండి ఆందోళనలు నిరసనలు ఎదురవుతున్నాయి. చార్జీల పెంపుదలతో ఆయా జిల్లాల్లో ప్రజలు ఆందోళన బాట పట్టారు.

చార్జీలను వెంటనే తగ్గించాలి...జగ్గారెడ్డి

చార్జీలను వెంటనే తగ్గించాలి...జగ్గారెడ్డి

ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేతలు సైతం చార్జీల పెంపుపై విరుచుకుపడుతున్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో ఓవైపు సంవత్సరానికి వెయ్యి కోట్ల రుపాయాలు కేటాయిస్తామని చెబుతూనే మరోవైపు ప్రజలపై భారం వేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుల్లో ఉన్న ఏపీ... కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తుంటే... మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ మాత్రం ఆర్టీసీని వలీనం చేయకపోగా... చార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం వేసిందని ఆయన మండిపడ్డారు.

చార్జీల పెంపుపై ఆందోళనలు పెరిగే అవకాశం...

చార్జీల పెంపుపై ఆందోళనలు పెరిగే అవకాశం...


చార్జీల పెంపుదలపై ప్రజల్లో ఇప్పుడిప్పడే అవగాహన వస్తుంది. ఏమేర తమపై భారం పడింది, ఇందుకు గత కారణాలపై విశ్లేషిస్తున్నారు. చార్జీల పెంపుపై కొన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలు , పార్టీలు రోడ్లపైకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆందోళనలు మరింత పెరిగే అవకాశాలు కూడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడ స్కేచ్ వేస్తుండడంతో ప్రజలు కూడ వారికి మద్దతు పలికేందుకు రోడ్లపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం... ఇన్నాళ్లు కార్మికుల రూపంలో ఇబ్బంది ఎదుర్కొనగా... తాజాగా ప్రయాణికుల నుండి నిరసనలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+