RTC: ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ.. డే బస్ పాస్ ధరలు పెంపు..

ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. డే పాస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ పరిధిలో తిరిగే సిటి బస్సుల్లో డే బస్ పాస్ ధరను ఏకంగా రూ.20 పెంచింది. 100 రూపాయలు ఉన్న డే పాస్ ఇప్పుడు రూ.120 లకు పెరిగింది. ప్రస్తుతం డే బస్ పాస్ మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ. 100 లకు లభించనుంది. అంతుకుముందు వీరికి రూ.80 లకే డే బస్ పాస్ లభించేది.

గతంలో డే బస్ పాస్ రూ.120 లుగానే ఉండేది. అయితే ప్రయాణికులను ఆకర్షించేందుకు డే బస్ పాస్ ధరను రూ.100 తగ్గించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రాయితీ కూడా ఇస్తున్నారు. తాజాగా ఆర్టీసీ గతంలో ఉన్న ధరనే ఖరారు చేసింది. డే బస్ పాస్ ధరలు పెరగడంతో వాటికి ఆదారణ తగ్గే అవకాశం ఉంది. డే బస్ పాస్ రూ.120 ఉన్నప్పుడు రోజుకు 25 పాసులు అమ్ముడుపోతే.. రూ.100 లకు తగ్గించినప్పుడు రోజుకు 40 వేల డే బస్ పాసులు విక్రయించారు.

tsrtc12

దీన్ని బట్టి మళ్లీ డే బస్ పాసులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఆర్టీసీ డే బస్ పాసులనే కాదు గతంలో నార్మల్ టికెట్ ధరలు కూడా భారీగా పెంచింది. ఆర్టీసీ తెలియకుండా బస్ టికెట్ ధరలు పెంచింది. ఒకప్పుడు కరీంనగర్ నుంచి జేబీఎస్ కు ఎక్స్ ప్రెస్ బస్ టికెట్ రూ.180 ఉంటే.. ఇప్పుడు అది రూ.240 లకు పెంచారు. టికెట్ ధరల పెంచడమే కాకుండా ప్రజలను ఆకర్షించేందుకు ఆర్టీసీ అనేక కార్యక్రమాలను ప్రారంభించింది.

ఆర్టీసీ ఈ మధ్య టీ9-30, టీ9-60 టికెట్లను ప్రవేశపెట్టింది. రూ.50 చెల్లించి టీ9-30 టికెట్ తీసుకుంటే 30 కిలోమీటర్ల పరిధిలో అప్ అండ్ డౌన్ ప్రాయణం చేయవచ్చు. అయితే ఈ టికెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే పని చేస్తుంది. ఇక టీ9-60 ను రూ.100 చెల్లించి కొనుగోలు చేస్తే.. 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణం చేయవచ్చు. ఈ టికెట్ కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+